Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

maharashtra

ఠాగూర్

, సోమవారం, 25 నవంబరు 2024 (10:58 IST)
మహారాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో మయాహుతి కూటమి ఘన విజయం సాధించింది. దీంతో మహాయుతి ప్రభుత్వం సోమవారం కొలువుదీరనుంది. ప్రస్తుత శాసనసభ కాలపరిమితి మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో సోమవారమే కొత్త సర్కారును ఏర్పాటు చేయడం అనివార్యమైంది. 
 
ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, ఆరు లేదా ఏడుగురు మంత్రులు ప్రమాణం చేయవచ్చని తెలుస్తోంది. తదుపరి విస్తరణలో బీజేపీకి చెందిన 22-24 మంది ఎమ్మెల్యేలకు చోటుదక్కుతుందనే ప్రచారం సాగుతుంది. ఏక్‌నాథ్ షిండే వర్గానికి 10-12, ఎన్సీపీ నేత అజిత్ వర్గానికి 8-10 మంత్రి పదవులు దక్కుతాయన్న ప్రచారం సాగుతుంది. 
 
అయితే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ఇపుడు ఆసక్తికర చర్చ సాగుతుంది. ఇందుకోసం మహాయుతి కూటమిలో చర్చలు, సంప్రదింపులు కొనసాగుతున్నాయి. సొంతంగానే అత్యధిక స్థానాలు సాధించి, అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన బీజేపీ, తమ పార్టీ నాయకుడు, ఇప్పటివరకు ఉపముఖ్యమంత్రిగా ఉన్న దేవంద్ర ఫడ్నవిస్‌వైపే మొగ్గు చూపుతోంది. అదేసమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పని తీరును బీజేపీ పెద్దలు ప్రశంసిస్తున్నారు. మరోవైపు, శివసేన (షిండే వర్గం) నాయకులు కందేరకు.. ఎన్సీపీ (అజితవర్గం) నేతలు అజిత్‌పవార్ వంటి సీఎం పదవి ఇవ్వాలని కోరుతున్నారు. 
 
అయితే.. సీఎంగా ఎవరిని నియమించాల నేదానిపై సంప్రదింపుల వేదిక ఇప్పుడు ముంబై నుంచి ఢిల్లీకి మారింది. కూటమి అగ్రనేతలు ఢిల్లీకి పయనమయ్యారు. సోమవారం ఉదయానికల్లా నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. ఫడ్నవిస్‌కు న్యాయంగా సీఎం పీఠం దక్కాలని ఆరెస్సెస్ అభిప్రాయపడుతోంది. మహారాష్ట్ర ప్రజలు ఇంత భారీ మెజారిటీని కట్టబెట్టిన నేపథ్యంలో బీజేపీ సొంత పార్టీ నేతకే సీఎం. పగ్గాలు అప్పగించడం సబబనే సందేశాన్ని పరోక్షంగా బీజేపీ అగ్రనాయకు లకు పంపినట్లు విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భక్తజనకోటితో నిండిపోయిన శబరిమల క్షేత్రం... రూ.41 కోట్ల ఆదాయం