Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

16 ఏళ్ల బాలికపై ఎనిమిది మంది సామూహిక అత్యాచారం..

Advertiesment
rape
, సోమవారం, 19 డిశెంబరు 2022 (13:33 IST)
దేశంలో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలికపై 8 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. పాల్ఘర్ జిల్లాకు చెందిన బాధిత బాలికను కలిసిన ఓ బాలుడు ఆమెకు మాయమాటలు చెప్పి సముద్ర తీర గ్రామంలోని ఓ ఖాళీ భవనంలోకి తీసుకెళ్లాడు.
 
ఆ తర్వాత అక్కడి మరో ఏడుగురు నిందితులు వచ్చారు. అనంతరం అందరూ కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఆమెను సముద్రం ఒడ్డుకు తీసుకెళ్లి మరోమారు అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
రాత్రంతా వేధింపులు ఎదుర్కొన్న బాలిక ఉదయం ఇంటికి చేరుకుంది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడు సహా ఎనిమిది మందినీ అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐదో తరగతి విద్యార్థిని కిందకు తోసేసిన స్కూల్ టీచర్