ప్రయాగ్‌రాజ్‌లోని మఠంలో మహంతి నరేంద్ర గిరి అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ముగ్గురు నిందితులకు లై డిటెక్టర్ పరీక్షను నిర్వహించాలని సీబీఐ ప్రయాగ్‌రాజ్ చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ వద్ద దరఖాస్తు పెట్టుకుంది.
మహంతి నరేంద్ర గిరి మృతి కేసులో ఆనంద గిరి, ఆద్య తివారి, సందీప్ తివారీలపై అనుమానాలు ఉన్నాయి. అయితే ఆ ముగ్గురికీ పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని సీబీఐ భావిస్తోంది. మంగళవారం రోజున మెజిస్ట్రేట్ ముందు సీబీఐ దరఖాస్తు పెట్టింది.
అక్టోబర్ 18న సీజేఎం కోర్టు దీనిపై విచారణ చేపట్టనుంది. నిందితులు కూడా వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరుకానున్నారు. అఖిల భారతీయ అఖాడా పరిషద్ అధ్యక్షుడు నరేంద్ర గిరి ఆత్మహత్య చేసుకునేలా నిందితులు రెచ్చగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ప్రయాగ్‌రాజ్‌లోని భాగంబరి మఠంలో సెప్టెంబర్ 20వ తేదీన ఉరి వేసుకుని నరేంద్ర గిరి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ముగ్గురు తనను మానసికంగా వేధించినట్లు మహంతి నరేంద్ర గిరి తన సూసైడ్ నోట్‌లో ఆరోపించారు. ఐపీసీలోని 306 సెక్షన్ ప్రకారం ఆ ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.