Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వంట చేయడం ఆలస్యమైందని భార్యను కొట్టి బావిలో తోసిన భర్త

deadbody
, గురువారం, 26 మే 2022 (17:09 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. వంట చేయడం ఆలస్యం కావడాన్ని జీర్ణించుకోలేని ఓ కిరాతక భర్త కట్టుకున్న భార్యను చితకబాది పక్కనే ఉన్న బావిలో నెట్టేశాడు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దేవాస్ ప్రాంతం, తిల్యాఖేదీలో దినేశ్ మాలి అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. ఆయన పని నుంచి ఇంటికి తిరిగిరాగానే భార్య యశోదను ఇంకా వంట కాలేదా? అని అడిగాడు. అయితే, తాను ఇంకా వంట చేయలేదని, కొంత సమయం పడుతుందని సమాధానమిచ్చింది. 
 
ఈ సమాధానంతో ఆగ్రహంతో ఊగిపోయిన దినేశ్ మాలి భార్యను చితకబాదాడు. ఇంతలో కుమార్తె నిఖిత అడ్డురాగా ఆమెను కూడా చావబాదాడు. భార్యను కొట్టిన దెబ్బలకు ఆమె కిందపడిపోయింది. అప్పటికీ అతని ఆగ్రహం చల్లారకపోవడంతో ఆమెను పక్కనే ఉన్న బావిలో నెట్టేసి అక్కడ నుంచి పారిపోయాడు. 
 
ఈ విషయాన్ని కుమార్తె నిఖిత తన బంధువులకు తెలియజేసింది. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడకు చేరుకుని బావిలో ఉన్న యశోద మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. దినేష్ మాలిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిటిషనర్లపై తొందరపాటు చర్యలు వద్దు : ఏపీ సీఐడీకి కోర్టు ఆదేశం