Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెల్లిని మామతో కలిసి రేప్ చేసిన అన్నదమ్ములు.. తలనరికి చంపేశారు...

Advertiesment
చెల్లిని మామతో కలిసి రేప్ చేసిన అన్నదమ్ములు.. తలనరికి చంపేశారు...
, బుధవారం, 20 మార్చి 2019 (09:24 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మానవత్వానికి మచ్చ తెచ్చేలా ప్రవర్తించారు ఇద్దరు అన్నదమ్ములు. ఏకంగా 12 యేళ్ల చెల్లిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. తమ మామయ్యతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డరాు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్‌లో మార్చి 14వ తేదీన జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సాగర్‌కు చెందిన 12 యేళ్ళ బాలిక పరీక్షలు రాసేందుకన ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. దీనిపై ఆ యువతి తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు బాలిక మృతదేహాం లభించింది. 
 
ఈ క్రమంలో చోటే పటేల్‌ అనే వ్యక్తితో తమకు భూతగాదాలు ఉన్నాయని, అతడే ఈ చర్యకు పాల్పడి ఉండొచ్చునని ఆమె మామయ్య పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. కానీ, బాలిక మృతదేహానికి నిర్వహించిన పోస్ట్‌మార్టమ్‌ నివేదికలో బాలిక సామూహిక అత్యాచారానికి గురైందని తేలడంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి.
 
ఈ క్రమంలో పోలీసులకు మామయ్యపైనే అనుమానం వచ్చింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని సుదీర్ఘంగా వించారించారు. ఈ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సోదరులిద్దరూ చెల్లిని తమ వెంటబెట్టుకుని మామయ్య వద్దకు తీసుకెళ్లారు. అక్కడ వారంతా కలిసి అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీంతో మొదట వీరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వారి మామ.. ఆ తర్వాత తాను కూడా మృగంలా ప్రవర్తించాడు. 
 
ఈ తతంగం మొత్తం అతడి భార్యకు కూడా తెలుసు. కానీ ఆమె కూడా వారిని వారించలేదు సరికదా.. బాలిక పోలీసులకు చెప్తానని బెదిరించడంతో గొంతు నులిమి చంపేసింది. అనంతరం బాలిక సోదరులు, మామ కలిసి కొడవలితో ఆమె తలను నరికారు. మొండాన్ని, తలను తమ పొలాల్లో వేర్వేరు చోట్ల పడేశారు. ఆ తర్వాత ఈ నెపాన్ని తమతో భూతగాదాలున్న వ్యక్తిపై మోపారు. ఈ కేసులో బాధితురాలి మామ, ఒక సోదరుడి(20)ని అరెస్టు చేశాం. మరొక వ్యక్తి(మైనర్‌) పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిస్ ఇండియా ఛార్మింగ్ ఫేస్... ఆర్మీలో లెఫ్టినెంట్‌...