Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోడ్లపై పరుగులు తీసేందుకు సిద్ధమైన తొలి హైడ్రోజన్ బస్సు

Hydrogen Fuel Bus
, మంగళవారం, 23 ఆగస్టు 2022 (11:06 IST)
Hydrogen Fuel Bus
దేశీయంగా తయారైన తొలి హైడ్రోజన్ బస్సు రోడ్లపై పరుగులు తీసేందుకు సిద్ధమైంది. హైడ్రోజన్‌ను ఇంధనంగా ఉపయోగించుకుని నడిచే ఈ నెక్ట్స్ జనరేషన్ బస్సును కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ పూణేలో ఆవిష్కరించారు. 
 
డీజిల్ బస్సులతో పోల్చితే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌తో నడిచే బస్సుల తయారీ వ్యయం చాలా తక్కువ అని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఈ హైడ్రోజన్ ఆధారిత బస్సులు దేశంలో విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతాయని పేర్కొన్నారు.
 
ఈ బస్సును కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), కేపీఐటీ లిమిటెడ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ బస్సులోని ఫ్యూయల్ సెల్ హైడ్రోజన్‌ను, గాలిని క్రమపద్ధతిలో వినియోగించుకోవడం ద్వారా విద్యుశ్చక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఆ శక్తిని బస్సుకు అందిస్తుంది. ఈ ప్రక్రియలో ఎక్కడా కాలుష్యానికి తావు ఉండదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు - పోలీసుల అదుపులో బీజేపీ ఎమ్మెల్యే