Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'పేదోడి కుమార్తెను కాకపోవడం అదృష్టం... దేవుడిదయ వల్ల నన్ను రేప్‌ చేయలేదు'

హర్యానా రాష్ట్రంలో పీకల వరకు మద్యం సేవించి.. యువతిని వేధించిన కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయగా, వీరిని విచారణ అనంతరం బెయిల్‌‍పై విడుదలచేశారు. ఆ ఇద్దరు కామాంధుల్లో ఒకరు హర్యానా బీజేపీ అధ్యక్షుడు

Advertiesment
Haryana
, సోమవారం, 7 ఆగస్టు 2017 (11:03 IST)
హర్యానా రాష్ట్రంలో పీకల వరకు మద్యం సేవించి.. యువతిని వేధించిన కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయగా, వీరిని విచారణ అనంతరం బెయిల్‌‍పై విడుదలచేశారు. ఆ ఇద్దరు కామాంధుల్లో ఒకరు హర్యానా బీజేపీ అధ్యక్షుడు సుభాష్‌ బారాలా కుమారుడు వికాస్‌ బరాలా కాగా మరొకరు అతని స్నేహితుడు ఆశిష్‌ కుమార్‌. వీరిద్దరూ శుక్రవారం రాత్రి ఓ యువతిపై వేధింపులకు పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో వెంటనే స్పందించిన పోలీసులు ఈ ఇద్దరిని అరెస్టు చేశారు. విచారణ అనంతరం శనివారం బెయిల్‌పై వికాస్ విడుదలయ్యారు.
 
ఆ కాళరాత్రి నుంచి బయటపడిన బాధితురాలు ఫేస్‌బుక్‌ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. ఇది ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా.. వికాస్‌ చేతిలో ఎదుర్కొన్న వేధింపులు, అనుభవించిన భయానకవాతావరణం తదితర వివరాలను ఆమె పోస్ట్‌లో వివరించింది. తాను సామాన్యుడి బిడ్డను అయితే ఈ కేసును ఇంత సీరియస్‌గా తీసుకొని ఉండేవారు కాదేమోనని అని వ్యాఖ్యానించింది. ఐఏఎస్‌ అధికారి కూతురు అయినందువల్లే పోలీసులు ఇంత త్వరగా స్పందించారని పేర్కొంది. 
 
'ఆ రాత్రి నేను ఎంతో భయపడ్డాను. నా చేతులు వణికాయి. భయంతో వెన్ను జలదరించింది. ఒకవైపు విస్మయం.. ఇంకోవైపు కళ్లలో నీళ్లు.. నేను ఈ రోజు ఇంటికి వెళుతానా? లేదో తెలియని భయం. పోలీసులు ఎప్పుడు వస్తారో ఎవరికి తెలుసు' అంటూ ఆమె వివరించారు. 'గతరాత్రి చండీగఢ్‌ రోడ్డుమీద దాదాపు కిడ్నాప్ అయ్యేదాన్ని' అంటూ ఆమె శనివారం పెట్టిన పోస్టును ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఎంతోమంది ఈ పోస్టును షేర్‌ చేసుకుంటున్నారు.
 
'సామ్యానుడి కూతురిని కాకపోవడం నా అదృష్టమేమో.. ఎందుకంటే, అలాంటి వీఐపీలను సామాన్యులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందా? నాపై రేప్‌, హత్య వంటి దుర్మార్గాలు జరగకపోవడం కూడా నా అదృష్టమే అనుకుంటున్నా' అని ఆమె పేర్కొన్నారు. ఎందుకంటే బలమైన రాజకీయ ప్రాబల్యమున్న కుటుంబాలకు చెందిన వ్యక్తులు వెంటాడి వేధించారని ఆమె తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమ పేరుతో గర్భం చేశాడు... ఆపరేషన్ వికటించి ప్రియురాలి మృతి.. ఎక్కడ?