Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 15 April 2025
webdunia

లాక్‌డౌన్ ఫలితం... హస్తినలో తగ్గిన అత్యాచారాలు

Advertiesment
Lockdown Effect
, బుధవారం, 15 ఏప్రియల్ 2020 (18:28 IST)
కరోనా వైరస్ పుణ్యమాని దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. అదీకూడా అత్యంత పకడ్బంధీగా అమలు చేస్తున్నారు. అయితే, ఈ లాక్‌డౌన్ కామాంధులకు ఓ శాపంలా మారిపోయింది. ఫలితంగా అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దేశ రాజధాని ఢిల్లీలో ఈ అత్యాచారాల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. 
 
దేశంలో లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 12వ తేదీ వరకు 83 శాతం కేసులు తగ్గినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఈ మధ్యకాలంలో కేవలం 23 కేసులు మాత్రమే నమోదు అయ్యాయని తెలిపారు. గతేడాది అయితే ఈ సమయంలో 139 అత్యాచార కేసులు నమోదైనట్లు వివరించారు. 
 
మహిళలపై దాడుల కేసులు కూడా గణనీయంగా తగ్గినట్లు పోలీసులు వెల్లడించారు. 2019లో ఈ సమయంలో 233 కేసులు నమోదు అయితే ఇప్పుడు కేవలం 33 కేసులు మాత్రమే నమోదు అయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. అత్యాచార కేసులు 83.4 శాతం తగ్గితే, మహిళలపై దాడుల కేసులు 85.8 శాతం తగ్గినట్లు ఢిల్లీ పోలీసులు స్పష్టంచేశారు. 
 
మహిళలపై అత్యాచారాలు, దాడులు తగ్గడానికి ప్రధాన కారణం ప్రజా రవాణాపై నిషేధం విధించడమే అని పోలీసులు తేల్చిచెప్పారు. పురుషులు మద్యం సేవించకపోవడంతో.. మహిళలపై దాడులు తగ్గాయన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం ఆదేశించడంతో.. మహిళల వద్దకు పురుషులు వెళ్లే సాహసం చేయలేకపోతున్నారని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనావైరస్ రోగులకు ఇంట్లో ఉంచే వైద్య పర్యవేక్షణ, చికిత్స