Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జల్లికట్టుపై ఆర్డినెన్స్ దిశగా సీఎం పన్నీర్ సెల్వం ఏర్పాట్లు.. 2రోజుల్లో?

తమిళనాడులో జల్లికట్టు నిర్వహణపై ఆందోళనలు ఉధృతమవుతున్న వేళ.. ఆ రాష్ట్రంలో జల్లికట్టు నిర్వహణకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ప్రయత్నాలు ముమ్మరం చేపట్టారు. జల్లికట్టు నిర్వహణకు వీలుగా త్వరలోనే ఆర

జల్లికట్టుపై ఆర్డినెన్స్ దిశగా సీఎం పన్నీర్ సెల్వం ఏర్పాట్లు.. 2రోజుల్లో?
, శుక్రవారం, 20 జనవరి 2017 (10:59 IST)
తమిళనాడులో జల్లికట్టు నిర్వహణపై ఆందోళనలు ఉధృతమవుతున్న వేళ.. ఆ రాష్ట్రంలో జల్లికట్టు నిర్వహణకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ప్రయత్నాలు ముమ్మరం చేపట్టారు. జల్లికట్టు నిర్వహణకు వీలుగా త్వరలోనే ఆర్డినెన్స్‌ తీసుకురానున్నట్లు చెప్పారు. ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి, గవర్నర్‌ ఆమోదానికి ప్రయత్నిస్తున్నామని... దాని కాపీకి ఇప్పటికే కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు అందించినట్లు పన్నీర్‌సెల్వం చెప్పారు. జల్లికట్టుపై కేంద్రం కూడా సరైన నిర్ణయం ప్రకటించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే ఆర్డినెన్స్‌ తీసుకురావాలని ప్రయత్నిస్తోంది.
 
తమ సంప్రదాయ క్రీడ జల్లికట్టును సుప్రీం కోర్టు నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ.. గత మూడు రోజులుగా చెన్నైలోని మెరీనా బీచ్‌ వద్ద భారీ ఆందోళన చేపట్టిన తమిళుల నిరసన సెగ ఢిల్లీని సైతం తాకింది. శుక్రవారం ఢిల్లీలోని తమిళనాడు హౌస్‌ ఎదుట విద్యార్థులు, యువకులు జల్లికట్టుకు మద్దతుగా ప్లకార్డులను ప్రదర్శించి ఆందోళన చేపట్టారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని నినాదాలు చేశారు.
 
మరోవైపు, గురువారం తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. జల్లికట్టు నిర్వహణకు ఆర్డినెన్స్‌ జారీచేయాలని ఆయన ప్రధానిని కోరారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. జల్లికట్టు తమిళనాడు సంస్కృతిలో అంతర్భాగమని అన్నారు. అయితే సుప్రీంకోర్టు దీనిపై నిషేధం విధించినందువల్ల ఏ నిర్ణయం తీసుకున్నా ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని తమిళనాట బంద్.. జనసంద్రంతో నిండిన మెరీనా బీచ్..