Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని తమిళనాట బంద్.. జనసంద్రంతో నిండిన మెరీనా బీచ్..

గత ఏడాది వర్దా తుఫాను, అంతకుముందు ఏడాది వరద బీభత్సంతో తమిళ ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణంతో తమిళనాట అశాంతి నెలకొంది. ఇలా ప్రతి రోజూ ఏదో ఒక సమస్య సోషల్ మీడియాను కుదిపేస

జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని తమిళనాట బంద్.. జనసంద్రంతో నిండిన మెరీనా బీచ్..
, శుక్రవారం, 20 జనవరి 2017 (10:21 IST)
గత ఏడాది వర్దా తుఫాను, అంతకుముందు ఏడాది వరద బీభత్సంతో తమిళ ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణంతో తమిళనాట అశాంతి నెలకొంది. ఇలా ప్రతి రోజూ ఏదో ఒక సమస్య సోషల్ మీడియాను కుదిపేస్తూనే ఉంది. తాజాగా జల్లికట్టు నిషేదం తొలగించాలని తమిళనాడు ప్రజలు, రాజకీయ నాయకులు, సిని ఇండస్ట్రీ మొత్తం ఏకతాటిపై నడుస్తున్నారు.
 
రాష్ట్రంలో సాంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టుపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలంటూ భారీ స్థాయిలో నిరసనలు తెలుపుతున్నారు తమిళ ప్రజలు. చెన్నైలోని మెరీనాబీచ్‌లో నిరసనలు హోరెత్తుతున్నాయి. జల్లికట్టు కోసం జరుగుతున్న ఆందోళనకు మద్దతిచ్చే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. అంతే కాదు జల్లికట్టుకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగోరోజు నిరసనలు కొనసాగుతున్నాయి. 
 
శుక్రవారం ప్రజలు స్వచ్ఛంధంగా బంద్ పాటిస్తున్నారు. విద్య, వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి.  ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. నల్లజెండాలతో నిరసన తెలుపుతున్నారు. డీఎంకే కార్యకర్తలు రైల్‌రోకో చేస్తున్నారు. సినిమా షూటింగ్‌లను సైతం నిలిపివేశారు. కాగా శుక్రవారం తమిళనాడు రాష్ట్ర బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. విద్యార్థులు తలపెట్టిన బంద్‌కు డీఎంకే మద్దతు ప్రకటించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫేస్‌బుక్‌లో గుడ్ బై అంటూ మెసేజ్ పెట్టి.. ఉరేసుకున్న విద్యార్థి.. ఎక్కడ?