ఇప్పటికైతే భూకంపం వచ్చే అవకాశం ఏమీ లేదు: రాహుల్‌కు చురకలంటించిన మోడీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆరు నెలల పరిధిలో సహార కంపెనీ నుంచి మొత్తం 9సార్లు 40.1 కోట్ల రూపాయలను ముడుపులుగా అ
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆరు నెలల పరిధిలో సహార కంపెనీ నుంచి మొత్తం 9సార్లు 40.1 కోట్ల రూపాయలను ముడుపులుగా అందుకున్నారని తేదీలతో సహా రాహుల్ వివరించారు. బిర్లా సంస్థల నుంచి కూడా మోడీకి ముడుపులు అందాయని ఆరోపించారు.
ఇంకా తాను మాట్లాడితే భూకంపం వస్తుందన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్రమోదీ కౌంటర్ వేశారు. వాళ్లకు యువ నాయకుడున్నాడు. అతను ఎలా మాట్లాడాలో నేర్చుకుంటున్నాడు. ఆయనకు మాట్లాడటం వస్తే నేను చాలా సంతోషిస్తాను. నిజానికి ఆయన మాట్లాడి ఉండకపోతేనే భూకంపం వచ్చేదేమో. ఆ భూకంపాన్ని ప్రజలు పదేళ్ల పాటు అనుభవించాల్సి వచ్చేదని చురకలంటించారు.
వారణాసిలో మోడీ మాట్లాడుతూ.. వ్యవస్థను మార్చేందుకే పెద్దనోట్ల రద్దు ప్రక్రియ చేపట్టామని తెలిపారు. అవినీతిపరులకు కొంతమంది నేతలు మద్దతు ఇస్తున్నారని, ఇలా ఎందుకు చేస్తున్నారో తనకు అర్థం కావట్లేదని చెప్పారు. పేదల కోసం కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదని చెప్పారు. నోట్ల రద్దుకు మద్దతు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలని అన్నారు.