గోవును చంపితే ఇక యావజ్జీవ శిక్షే: గుజరాత్‌లో బిల్లుకు కోరలు.
గోవును చంపితే గరిష్టంగా యావజ్జీవ శిక్ష కనిష్టంగా పదేళ కారాగార వాసాన్ని విధిస్తూ గుజరాత్ ప్రభుత్వం కఠోర నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ గైర్హాజరీలో శాసనసభలో అతిధుల గ్యాలరీలో అనేకమంది కాషాయ వస్త్రాలు ధరించిన హిందూ పూజారుల సమక్షంలో గుజరాత్ ప్రభు
గోవును చంపితే గరిష్టంగా యావజ్జీవ శిక్ష కనిష్టంగా పదేళ కారాగార వాసాన్ని విధిస్తూ గుజరాత్ ప్రభుత్వం కఠోర నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ గైర్హాజరీలో శాసనసభలో అతిధుల గ్యాలరీలో అనేకమంది కాషాయ వస్త్రాలు ధరించిన హిందూ పూజారుల సమక్షంలో గుజరాత్ ప్రభుత్వం జంతు పరిరక్షణ బిల్లుకు చేసిన సవరణను ఆమోద ముద్ర పొందింది. సవరణ ఆమోదం పొందిన నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మాట్లాడుతూ తాను ఏ ఒక్క ఆహారానికి వ్యతిరేకిని కానని, కానీ గుజరాత్‌ను శాకాహార రాష్ట్రంగా మార్చాలని అనుకుటున్నట్లు చెప్పారు.
మేము మా రాష్ట్రంలో జెర్సీ ఆవులను కోరుకోవటం లేదు, కానీ దేశవాళీ గిర్, కాంక్రెజీ ఆవులను కోరుకుంటున్నామన్నారు. గుజరాత్‌ను విశిష్టమైన రాష్ట్రంగా రూపాని అభివర్ణించారు. ఇది మహాత్మాగాందీ ప్రవచించిన అహింస, సత్యం అనే సూత్రాలను అనుసరించే దేశం అని, ఇది గాంధీ గుజరాత్, సర్దార్ వల్లభ్ బాయ్ పటేల్ గుజరాత్, ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ అంటూ సీఎం నొక్కి చెప్పారు.
ఉనా ప్రాంతంలో ఆవును చంపారనే కారణంతో ఏడుమంది దళితులను గో పరిరక్షకులుగా చెప్పుకున్నవారు చిత్రహింసలు పెట్టిన ఘటన జరిగిన ఎనిమిది నెలల తర్వాత గుజరాత్ జంతు పరిరక్షణ సవరణ బిల్లు 2017 ఆమోదం పొందింది.గతంలో తీసుకొచ్చిన గోవధ నిరోధ చట్టం గోహత్యకు పాల్పడిన వారికి 3 నుంచి 7 సంవత్సరాల శిక్షను విధించగా కొత్తగా సవరించిన బిల్లు గోవును చంపిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడానికి వీలు కల్పిస్తోంది.
బిల్లు పాస్ చేయడానికి ముందు కాంగ్రెస్ సభ్యులు సభలో తీవ్ర గలాబా సృష్టించడంతో స్పీకర్ వారిని సస్పెండ్ చేశారు.
ఒక నెల క్రితం జంతు పరిరక్షణ సవరణ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు గోహత్యకు పాల్పడిన వాళ్లకు పదేళ్ల గరిష్ట శిక్షను మాత్రమే పొందుపరచారు. కానీ శుక్రవారం ఆమోదించిన బిల్లులో యావజ్జీవ శిక్షను పాలక బీజేపీ ప్రతిపాదించి ఆమోదింప జేసుకుంది.
పైగా చట్టవిరుద్ధంగా ఆవులను రవాణా చేసే వాహనాలకు రాష్ట్ర ప్రభుత్వం జప్తు చేసుకునే అధికారాన్ని ఈ బిల్లు కలిగించింది. ఇలా అక్రమ రవాణా చేసేవారికి విధించే జరిమానాను 50 వేల నుంచి 1-5 లక్షలకు పెంచడం గమనార్హం.