Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోవిడ్-19పై అపోహలను ఛేదిద్దాం, వివక్షను అరికడదాం

Advertiesment
కోవిడ్-19పై అపోహలను ఛేదిద్దాం, వివక్షను అరికడదాం
, సోమవారం, 6 జులై 2020 (08:57 IST)
దేశవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. ఇటువంటి తరుణంలో వైద్యసిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు నిత్యం వారి ప్రాణాలను ఫణంగా పెట్టి మన కోసం ముందుండి పోరాడుతున్నారు. 
 
మనం క్షేమంగా ఉండాలని వాళ్లు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఈ క్రమంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ లో చాలా మంది కోవిడ్-19 బారినపడుతున్నారు.
 
మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వారు చేస్తున్న సేవలను ప్రశంసించాలి, అంతేకానీ ఎంతో ఒత్తిడితో పనిచేస్తున్న వారిపట్ల, వారి కుటుంబాల పట్ల వివక్ష చూపకూడదు. 
 
అదే విధంగా వారి గురించి గానీ, కోవిడ్-19 గురించి గానీ తప్పుడు ప్రచారం చేయడం సమంజసం కాదు. ఈ సంక్షోభ సమయంలో పుకార్లు మరియు తప్పుడు సమాచారం వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల్లో తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయి. 
 
అంతే కాకుండా ఇటువంటి పరిణామాలు కోవిడ్-19 బాధితుల రికవరీపైనా ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మార్గదర్శకాలను విపులంగా క్రోడీకరించి క్రింద జత చేస్తున్నాము.  
 
అందరం పాటించి కోవిడ్-19 కు వ్యక్తిరేకంగా ఏకమవుదాం.  ఇవి నాకు వర్తించదు అని ఎవరు అనుకున్నా వారు తమను ఇతరులను కూడా ప్రమాదంలో నికి నెడుతున్నారని గమనించవలసినది.
 
మాస్కు సబ్బుతో పోయేదానికి  అంబులెన్స్ ఐ సీ యు దాకా తెచ్చుకోవద్దు!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రాలో ఆ వయసు వారికే కరోనా వైరస్ సోకుతుందా?