Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లాలా లజపతి రాయ్ పుట్టిన రోజు: పంజాబ్ కేసరి.. అతివాద రాజకీయాలను..?

Advertiesment
లాలా లజపతి రాయ్ పుట్టిన రోజు: పంజాబ్ కేసరి.. అతివాద రాజకీయాలను..?
, గురువారం, 28 జనవరి 2021 (11:29 IST)
Lala Lajpathrai Jayanthi
లాలా లజపతి రాయ్ పుట్టిన రోజు నేడు. పంజాబ్ కేసరిగా ప్రసిద్ధి పొందిన జాతీయ యోధులు లాలా లజపతిరాయ్. పంజాబ్‌లోని జాగ్రాన్ పట్టణంలో 1865 జనవరి 28న జన్మించారు. స్వదేశీ ఉద్యమం, ఆర్య సమాజాన్ని, అతివాద రాజకీయాలను సమన్వయపరిచిన భారత జాతీయ అగ్రనాయకుల్లో లాలా లజపతిరాయ్ ఒకరు. హిందు మహాసభ, లోక్ సేవామండల్ సంస్థలను ఈయన ప్రారంభించారు. 
 
1920 సంవత్సరంలో లాలా లజపతి రాయ్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ ఎఐటి యుసి ఏర్పరిచారు. సైమన్ కమీషన్‌కు వ్యతిరేకంగా లాహోర్‌లో జరిగిన నిరసన ఊరేగింపులో లాఠీ దెబ్బలు తిని 1928 నవంబర్ 17న తుదిశ్వాస విడిచారు. 
 
లాలా లజపతి రాయ్ బహుముఖ ప్రజ్ఞశాలి. లజపతిరాయ్‌ ఉద్యమకారుడు. అతివాదుల వైపు మొగ్గినవారాయన. గొప్ప మేధావి, రచయిత, సంస్కర్త. కార్మికోద్యమ నిర్మాత. ముస్లింల పట్ల ఆయన వ్యక్తం చేసిన భావాలు కొంచెం తీవ్రంగానే ఉంటాయి. భారతదేశ విభజన అనే చారిత్రక అంశాన్ని పరిశీలించిన వారు ఆయనది సంకుచిత దృష్టి కాదనీ, దూరదృష్టి అనీ ఓ ముగింపునకు రాక తప్పదు.
 
బహుముఖ ప్రజ్ఞశాలి. లజపతిరాయ్‌ ఉద్యమకారుడు. అతివాదుల వైపు మొగ్గినవారాయన. గొప్ప మేధావి, రచయిత, సంస్కర్త. కార్మికోద్యమ నిర్మాత. ముస్లింల పట్ల ఆయన వ్యక్తం చేసిన భావాలు కొంచెం తీవ్రంగానే ఉంటాయి. భారతదేశ విభజన అనే చారిత్రక అంశాన్ని పరిశీలించిన వారు ఆయనది సంకుచిత దృష్టి కాదనీ, దూరదృష్టి అనీ ఓ ముగింపునకు రాక తప్పదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం