Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్టూడెంట్‌తో ప్రొఫెసర్ పెళ్లి.. అది ప్రాజెక్టులో భాగమా..? మరి రాజీనామా ఎందుకు?

Advertiesment
Lady Professor

సెల్వి

, బుధవారం, 5 ఫిబ్రవరి 2025 (12:44 IST)
Lady Professor
పశ్చిమ బెంగాల్‌లోని మౌలానా అబ్ధుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన ఘటన నెట్టింట వైరల్ అయ్యింది. ఒక మహిళా ప్రొఫెసర్ తరగతి గదిలో ఒక విద్యార్థినిని వివాహం చేసుకుంటూ కనిపించారు. ఇద్దరూ పూల దండలు మార్చుకుంటూ, ఆ విద్యార్థి ప్రొఫెసర్ నుదిటిపై సింధూరం పెట్టడం వీడియోలో కనిపించింది. ఈ వీడియోపై వర్శిటీ యాజమాన్యం విచారణ ప్రారంభించింది. అనంతరం అధికారులు ప్రొఫెసర్‌ను సెలవుపై ఉంచారు. స్టూడెంట్‌ను సస్పెండ్ చేశారు.
 
తాజాగా సదరు ప్రొఫెసర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన మానసిక క్షోభతో, విధులను కొనసాగించలేకపోతున్నానని తన రాజీనామా లేఖను రిజిస్ట్రార్ పార్థకు సమర్పించారు. ఆమె రాజీనామాపై విశ్వవిద్యాలయం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. 
 
ఫిబ్రవరి 1న విశ్వవిద్యాలయానికి ఇ-మెయిల్‌లో వీడియో రూపంలో తన రాజీనామా లేఖను సమర్పించారు. వీడియో వైరల్ కావడంతో మానసికంగా ఇబ్బంది పడుతున్నానని.. అందుకే రాజీనామా చేశానని ప్రొఫెసర్ అంటున్నారు. ఈ సంస్థతో కలిసి పనిచేసే అవకాశాన్ని కల్పించిన MAKAUTకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 
 
అయితే విద్యార్థితో ప్రొఫెసర్ వివాహం ఒక ప్రాజెక్ట్‌లో భాగమని తెలుస్తోంది. ఇది క్లాస్లో సైకో డ్రామా అని ప్రొఫెసర్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇది అకడమిక్ ప్రాజెక్టులో భాగమని.. అసలు పెళ్లి కాదని మహిళా ప్రొఫెసర్ విచారణలో వెల్లడించారు. 
 
సైకాలజీ డిపార్ట్‌మెంట్ ప్రతిష్టనే దిగజార్చేందుకు కొందరు వీడియోలను లీక్ చేశారని ప్రొఫెసర్ మండిపడ్డారు. త్వరలోనే నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆమె చెప్పారు. ఈ వ్యవహారంలో తనకు మద్దతు ఇస్తున్న ఆమె ఫ్యామిలీకి ధన్యవాదాలు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శంతనుకు కీలక పదవి... నా తండ్రిలా నడిచొచ్చే రోజులు వచ్చాయ్...