Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిర్యానీ తీసిస్తాం.. ఉద్యోగం ఇప్పిస్తాం.. బ్రిడ్జి నుంచి దిగరా బాబూ...?!

Advertiesment
death

సెల్వి

, మంగళవారం, 23 జనవరి 2024 (19:25 IST)
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తన జీవితాన్ని ముగించాలనే ఉద్దేశ్యంతో వంతెన ఎక్కాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో కోల్‌కతాలోని పార్క్ సర్కస్‌లో ఉన్న భారీ ఇనుప వంతెనపై వ్యక్తి ఎక్కినట్లు చూడవచ్చు. సదరు వ్యక్తి బ్రిడ్జి ఎక్కి అక్కడి నుంచి దూకేస్తానని బెదిరించాు. కానీ పోలీసుల జోక్యంతో కిందకు దిగాడు. 
 
కోల్‌కతాలోని ప్రముఖ హోటల్ నుంచి బిర్యానీ ఇస్తానని ఆ వ్యక్తికి పోలీసులు ఆఫర్ చేశారు. ఇంకా ఉద్యోగం కూడా ఇప్పిస్తామన్నారు. దీంతో ఆ బ్రిడ్జి నుంచి సదరు వ్యక్తి దిగాడు. ఆ వ్యక్తి డ్రామా సృష్టించి ఆ ప్రాంతంలో దాదాపు 20 నిమిషాలకు పైగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించాడు. ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుప్రో ప్రాఫిట్ ట్రక్ ఎక్సెల్‌ను విడుదల చేసిన మహీంద్రా