Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ పోలీసులు నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారు : వైఎస్ షర్మిల

Advertiesment
sharmila

వరుణ్

, ఆదివారం, 21 జనవరి 2024 (14:44 IST)
ఏపీ పోలీసులపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ పోలీసులు నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఉద్దేశ్యపూర్వకంగానే తన కాన్వాయ్‌ను దారి మళ్లించారని ఆమె ఆరోపించారు. ఏం సర్.. ప్రభుత్వానికి భయమేస్తుందా? అంటూ ఘాటుగా స్పందించారు. షర్మిలతో పాటు మాజీ మంత్రి రఘువీరా రెడ్డి, సుంకర పద్మశ్రీలు కూడా ఉన్నారు. 
 
కాగా, ఆమె ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించేందుకు వెళుతూ విజయవాడలో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కాన్వాయ్‌ను పోలీసులు దారి మళ్లించారు. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు... షర్మిల రోడ్డు మార్గంలో కడపకు వెళ్ళి, అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్నారు. నిడమానూరులో షర్మిల కాన్వాయ్‌లోని వాహనాలను పోలీసులు దారి మళ్లించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
మరికొన్ని గంటల్లో రామ్ లల్లా ప్రాణప్రతిష్ట వేడుకలు.. దేశ వ్యాప్తంగా ముస్తాబైన నగరాలు 
 
అయోధ్య రామాలయంలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ట వేడుకలు మరికొన్ని గంటల్లో ప్రారంభంకానున్నాయి. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ వేడుకలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అనేక నగరాల్లో అందంగా ముస్తాబు చేశఆరు. ఆలయాలను, పర్యాటక ప్రదేశాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. నేపాల్‌లోని జనక్ పూర్ కూడా ఈ వేడుకలు జరుగనున్నాయి. మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో వేల దీపాలతో రామనామం రాశారు. 
 
అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా అలంకరించారు. దీపాల కాంతుల్లో నగరం మెరిసిపోతుంది. రామ మంది ప్రవేశ ద్వారాన్ని పూలతో అందంగా అలంకరించారు. వీధుల్లో తారణాలు, గోడలపై రామాయణ గాథను తెలిపే చిత్రాలతో అయోధ్య నగరం మెరిసిపోతుంది. 
 
కాగా, అయోధ్యతో పాటు దేశవిదేశాల్లోనూ సంబరాలు జరుగుతున్నాయి. అయోధ్య ప్రాణప్రతిష్ట వేడుకలకు దేశ వ్యాప్తంగా పలు నగరాలు కూడా ముస్తాబయ్యాయి. దేశంలో ప్రసిద్ధి పొందిన కట్టడాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. పలుచోటు ఏర్పాటు చేసిన లైట్‌ షోలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది.
 
మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో వేలాది దీపాలతో సియావర్ రామచంద్ర కీ జై అంటూ నినాదాలు రాశారు. చాందా క్లబ్ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. జమ్మూకాశ్మీర్‌లోని శ్రీమాతా వైష్ణో దేవి ఆలయం విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతుంది. శ్రీరాముడి అత్తారిళ్లు నేపాల్‌‍లో జనక్ పూర్‌లోనూ సంబరాలు జరుగుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరికొన్ని గంటల్లో రామ్ లల్లా ప్రాణప్రతిష్ట వేడుకలు.. దేశ వ్యాప్తంగా ముస్తాబైన నగరాలు