Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పదో తరగతి విద్యార్థిని కోసం గ్రీన్ కారిడార్.. ఎందుకు?

kolkata cop
, సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (08:30 IST)
పదో తరగతి విద్యార్థిని కోసం ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటుచేశారు. పరీక్షా సమయం మించిపోవడంతో ఆ విద్యార్థిని పరీక్షా కేంద్రానికి తరలించేందుకు ఈ గ్రీన్ కారిడార్‍ను ఏర్పాటుచేసి, బాలికను సకాలంలో పరీక్షా కేంద్రానికి చేర్చారు. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని హౌరాలో జరిగింది. 
 
సాధారంగా అత్యవసర ఆపరేషన్ల కేసుల్లో అవయవ భాగాలను ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి తరలించే సమయంలోనే ఈ తరహా గ్రీన్ కారిడార్లు ఏర్పాటు చేసి వాటిని సకాలంలో చేర్చుతుంటారు. అయితే, ఇక్కడ పదో తరగతి విద్యార్థిని కోసం హౌరా ట్రాఫిక్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఒకరు వ్యక్తిగత రిస్క్ తీసుకుని ఈ గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేశారు. 
 
బెంగాల్‌లోని హౌరా వంతెన సమీపంలో ఓ బాలిక స్కూల్ యూనిఫాం ధరించి ఏడుస్తూ అటువైపు వెళ్తున్న వారిని సాయం కోసం అర్థించసాగింది. అదేసమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సావిక్ చక్రవర్తి ఆ బాలికను చూసి ఆరా తీశాడు.
 
తాను శాయంబజార్‌లోని ఆదర్శ్ శిక్షనికేతన్‌లో పదో తరగతి పరీక్ష రాస్తున్నానని, అక్కడకి వెళ్లాల్సి ఉందని సాయం చేయాలని ప్రాధేయపడింది. మరి ఇంట్లో వారు ఎవరు రాలేదా? అని అడిగారు. దానికి ఆ బాలిక సమాధానం చెబుతూ, తాతయ్య చనిపోయారని, ఇంట్లో వారంతా అంత్యక్రియలకు వెళ్లారని చెప్పింది. 
 
దీంతో చలించిపోయిన ఇన్‌స్పెక్టర్ ఆ బాలికను తన అధికారిక వాహనంలో ఎక్కించుకుని పరీక్ష కేంద్రానికి బయలుదేరారు. పరీక్షకు సమయం సమీపిస్తుండటంతో ఆ మార్గంలో గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాలంటూ ఉన్నతాధికారులు అనుమతి లేకుండా ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. 
 
దీంతో వారు ఎలాంటి ఆటంకం లేకుండా నిర్ణీత సమయానికి ఆ బాలికను పరీక్షా కేంద్రానికి చేర్చారు. కోల్‌‍కతా పోలీసులు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో అది కాస్త వైరల్ అయింది. ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఇన్‌స్పెక్ట‌‍‌ర్‌ను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెడికో ప్రీతి మృతిపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. రూ.30 లక్షలు ఎక్స్‌గ్రేషియా.. సర్కారీ కొలువు