Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొడనాడు ఎస్టేట్ వాచ్‌మెన్ హత్య కేసులో మరో ట్విస్ట్.. తుప్పుపట్టిన వాహనాలు..

కొడనాడు ఎస్టేట్ వాచ్‌మెన్ హత్య కేసులో అన్నాడీఎంకే చెందిన కవుండంపాళయం ఎమ్మెల్యే ఆరుకుట్టి హస్తం ఉండవచ్చన్న అనుమానంతో పోలీసులు ఆయన్ని ప్రశ్నించారు. వాచ్‌మెన్ హత్య కేసులో అనుమానాస్పదుడిగా ఉండి, ఆపై హత్య

Advertiesment
కొడనాడు ఎస్టేట్ వాచ్‌మెన్ హత్య కేసులో మరో ట్విస్ట్.. తుప్పుపట్టిన వాహనాలు..
, బుధవారం, 17 మే 2017 (09:50 IST)
కొడనాడు ఎస్టేట్ వాచ్‌మెన్ హత్య కేసులో అన్నాడీఎంకే చెందిన కవుండంపాళయం ఎమ్మెల్యే ఆరుకుట్టి హస్తం ఉండవచ్చన్న అనుమానంతో పోలీసులు ఆయన్ని ప్రశ్నించారు. వాచ్‌మెన్ హత్య కేసులో అనుమానాస్పదుడిగా ఉండి, ఆపై హత్య చేయబడిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత మాజీ డ్రైవర్ కనక్‌రాజ్ మృతి చెందే ముందు ఆరుకుట్టికి 300కు పైగా ఫోన్ కాల్స్ చేసినట్లు కాల్ హిస్టరీ చూపించడంతో పోలీసులు ఆయనను వివరించారు. 
 
కనకరాజ్, ఆరుకుట్టి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. పోలీసుల నుంచి సమన్లు అందుకున్న ఆరుకుట్టి విచారణకు హాజరు కాగా, ఆత్తూర్‌లో పోలీసులు ఆయన్ని ప్రశ్నించారు. ఈ కేసులో కనకరాజ్ అన్న ధనరాజ్ పాత్రపైనా పోలీసు వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
 
ఇదిలా ఉంటే.. జయలలిత మృతి తర్వాత పోయెస్ గార్డెన్ కళావిహీనంగా మారగా ఆమె వినియోగించిన కార్లు మూలనపడ్డాయి. ఆరు నెలలకు పైగా అలాగే ఉన్న రూ.50 లక్షల విలువైన ఆ వాహనాలు తుప్పు పడుతున్నాయి. ఆమె రాజకీయ వారసత్వం కోసం వర్గపోరు సాగుతుండగా ఆస్తుల సంగతి తెర వెనకే ఉండిపోయింది. జయలలిత ఆమె వీలునామా రాయకపోవడం, వారసులం తామే అంటూ సంబంధిత పత్రాలతో ఎవరూ రాకపోడంతో ఎటూ తేలకుండా ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేయలేదనీ మేడపై నుంచి తోసేసిన భర్త... ఎక్కడ?