Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యూనివర్శిటీలో చదువుకునే మహిళలకు గుడ్ న్యూస్..

Advertiesment
Pregnant woman
, బుధవారం, 8 మార్చి 2023 (11:00 IST)
మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థినులకు కేరళ యూనివర్శిటీ శుభవార్త అందించింది. యూనివర్శిటీలో చదువుకునే మహిళలకు... ప్రసూతి సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. 18 సంవత్సరాలు దాటిన అర్హులైన విద్యార్థినులకు.. ఈ సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపింది. 
 
ఆరు నెలల పాటు ఈ సెలవులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే కేరళ ప్రభుత్వం పీరియడ్స్ సమయంలో విద్యార్థినులకు సెలవులు ఇస్తుండగా.. తాజాగా కేరళ యూనివర్శిటీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ఈ సెలవులు పూర్తయిన తర్వాత నేరుగా క్లాసులకు హాజరు కావొచ్చని.. మరోసారి అడ్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నంద్యాల అటవీ అధికారుల హెచ్చరిక: ‘పిల్లలకు దూరమైన తల్లి పులి ఆగ్రహంగా ఉంటుంది.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి’