Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 27 March 2025
webdunia

పక్క సీట్లో బ్యూటీ గర్ల్... గట్టిగా తొక్కేశాడు... జర్నలిస్టును పొట్టనబెట్టుకున్నాడు...

Advertiesment
పక్క సీట్లో బ్యూటీ గర్ల్... గట్టిగా తొక్కేశాడు... జర్నలిస్టును పొట్టనబెట్టుకున్నాడు...
, శనివారం, 3 ఆగస్టు 2019 (17:52 IST)
అతడో బాధ్యతాయుతమైన ఐఏఎస్ అధికారి. ఐతే పీకల దాకా మద్యం సేవించాడు. అంతకుమించి అర్థరాత్రి వరకూ ఓ పార్టీలో ఎంజాయ్ చేయడమే కాకుండా ఓ మహిళను తీసుకుని ఆ మద్యం మత్తులోనే ఇంటికి బయలుదేరాడు. పక్కనే బ్యూటీ గర్ల్... మరోవైపు మద్యం మత్తు ఎక్కించే కిక్కుతో తను రోడ్డుపై ఎలా వెళుతున్నాడో కూడా తెలియలేదతనికి.

ఒక్కసారిగా ఎక్సలరేటర్‌ని గట్టిగా తొక్కేశాడు. అంతే... మెరుపు వేగంతో కారు రివ్వును దూసుకుపోయి ఓ మోటారు బైకును ఢీకొట్టింది. ఆ ధాటికి మోటారు బైకుపై వున్న వ్యక్తి 100 మీటర్ల దూరంలో బైకుతో సహా వెళ్లి గోడకు గుద్దుకున్నాడు. అంతే... అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. 
 
పూర్తి వివరాల్లోకి వెళితే... కేరళకు చెందిన శ్రీరామ్‌ వెంకటరామన్‌ అనే ఐఏఎస్‌ అధికారి కారు వేగంగా నడిపి బైక్‌పై వెళ్తున్న పాత్రికేయుడిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ప్రముఖ మలయాళ పత్రిక ‘సిరాజ్‌’ బ్యూరో ఛీఫ్‌ మహమ్మద్‌ బషీర్‌(35) మృతి చెందారు. 
webdunia
 
శనివారం తెల్లవారుజామున త్రివేండ్రం మ్యూజియం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో.... బైక్ 100 మీటర్ల దూరంలో ఎగిరిపడిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న బషీర్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కారులో ఉన్న ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. 
 
వెంకటరామన్‌ మోతాదుకి మించి మద్యం సేవించినట్లు వైద్యుల పరీక్షల్లో తేలింది. అయితే తాను కారు నడపలేదని, తన స్నేహితురాలే నడిపారని పోలీసులకు ఐఏఎస్‌ అధికారి వాంగ్మూలమిచ్చారు. ప్రత్యక్ష సాక్షులు మాత్రం దీనికి భిన్నంగా చెబుతున్నారు. సీసీ టీవీ దృశ్యాలు పరిశీలించి పోలీసులు ఆ సమయంలో కారు నడిపింది శ్రీరామ్ అని కనుగొన్నారు. కాగా మహిళను ప్రశ్నించగా... సదరు అధికారి పార్టీ ముగిశాక తనను కారులో డ్రాప్ చేసేందుకు కారు కావాలని అడిగితే తన కారులో ఆయన వెంట వచ్చినట్లు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్ గుండెలమీద చెయ్యివేసుకుని చెప్పు, తుగ్లక్ లా కాదు...