Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా భర్త నిజమైన దేశ భక్తుడు... మద్దతివ్వండి : కేజ్రీవాల్ సతీమణి

Advertiesment
sunitha kejriwal

వరుణ్

, శుక్రవారం, 29 మార్చి 2024 (15:26 IST)
తన భర్త నిజమైన దేశభక్తుడు అని, కోర్టులో వాస్తవాలు చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ అన్నారు. ఆమె శుక్రవారం కేజ్రీవాల్‌ను ఆశీర్వదించండంటూ వాట్సాప్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె ఓ వీడియోను షేర్ చేశారు. మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసుల ఈడీ కస్టడీలో ఉన్న తన భర్తకు మద్దతు ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చరాు. ఆయన నియంత శక్తులను సవాల్ చేస్తున్నారని, ఈ సమయంలో ఆయనకు మన మద్దతు అవసరమని చెప్పారు. 
 
కేజ్రీవాల్‌ను ఆశీర్వదిస్తున్నామని అందరూ సందేశాన్ని పంపాలని ఆమె కోరారు. పనిలోపనిగా వాట్సాప్ నంబరును కూడా షేర్ చేశారు. ఈ రోజే కేజ్రీవాల్‌కు ఆశీర్వాదమిచ్చే వాట్సాప్ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాం. మీరు మీ ఆశీర్వాదాలు, ప్రార్థనలు, దీవెనలు ఈ నంబర్‌కు సందేశం రూపంలో పంపించండి" అని విజ్ఞప్తి చేస్తూ, 82973 24624 అనే వాట్సాప్ నంబరును షేర్ చేశారు. 
 
ఇదిలావుంటే, ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ఆరోగ్యం బాగోలేదని, దీంతో ఆయన కుటుంబం ఆందోళన చెందుతుందని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన తీరు దారుణమని మండిపడ్డారు. కేజ్రీవాల్‌కు మద్దతుగా ఈ నెల 31న ప్రజలంతా రాంలీలా మైదాన్‌కు రావాలని కోరారు. కేజ్రీవాల్‌ను ప్రధాని నరేంద్ర మోడీ దీ అరెస్టు చేయించారని మండిపడ్డారు. ఇందుకు ఢిల్లీ ప్రజలంతా ప్రధానిపై ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. అరెస్టుపై ప్రతి ఒక్కరిలో అనుమానాలు ఉన్నాయన్నారు. గురువారం కోర్టులో కేజ్రీవాల్ వాస్తవాలను బయటపెట్టారన్నారు. నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తోందన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు