Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

10 రోజులైంది... 68 ఏళ్ల 'అమ్మ' ఫోటో చూపించడయ్యా... వాళ్లెళ్లిపోతారు... 92 ఏళ్ల 'అయ్య' కరుణ డిమాండ్

తమిళనాడు ముఖ్యమంత్రి పురిట్చితలైవి జయలలిత ఆసుపత్రిపాలై 10 రోజులు దాటిపోయింది. ఐతే ఆమె ఆరోగ్యంగానే ఉన్నారంటూ వార్తలయితే వస్తున్నాయి కానీ ఆమెకు సంబంధించిన ఫోటోలు మాత్రం ఒక్కటి కూడా బయటకు విడుదల కాలేదు. దీనిపై అన్నాడీఎంకె కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురవ

Advertiesment
10 రోజులైంది... 68 ఏళ్ల 'అమ్మ' ఫోటో చూపించడయ్యా... వాళ్లెళ్లిపోతారు... 92 ఏళ్ల 'అయ్య' కరుణ డిమాండ్
, సోమవారం, 3 అక్టోబరు 2016 (14:07 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి పురిట్చితలైవి జయలలిత ఆసుపత్రిపాలై 10 రోజులు దాటిపోయింది. ఐతే ఆమె ఆరోగ్యంగానే ఉన్నారంటూ వార్తలయితే వస్తున్నాయి కానీ ఆమెకు సంబంధించిన ఫోటోలు మాత్రం ఒక్కటి కూడా బయటకు విడుదల కాలేదు. దీనిపై అన్నాడీఎంకె కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో కార్యకర్తలు భారీగా చేరి అక్కడ నుంచి కదలడం లేదు. 
 
అమ్మ ఆరోగ్యంగానే ఉన్నారు... మీరు వెళ్లమని చెపుతున్నా వాళ్లు వినడంలేదు. అమ్మను చూసిన తర్వాతే ఇక్కడ నుంచి వెళతామని అంటున్నారు. ఈ వ్యవహారం మాజీముఖ్యమంత్రి కరుణానిధి దృష్టికి వెళ్లింది. దీనిపై ఆయన స్పందిస్తూ ప్రభుత్వం ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో తనకైతే అర్థం కావడంలేదన్నారు. ఆసుపత్రిలో జయలలిత ఆరోగ్యానికి సంబంధించిన ఫోటోలను విడుదల చేస్తే ఆమె కోసం ఎదురుచూస్తున్న కార్యకర్తలు వారివారి ఇళ్లకు వెళతారు కదా. ఇప్పటికైనా 68 ఏళ్ల జయలలిత ఆరోగ్యాన్ని తెలుపుతూ ఫోటోలు విడుదల చేయాలని 92 ఏళ్ల కరుణానిధి డిమాండ్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కావేరీ ఇష్యూపై ప్రశ్న అవసరమా? 50 ఏళ్లలో తండ్రైన అనుభూతి వేరు..: ప్రకాష్ రాజ్