కావేరీ ఇష్యూపై ప్రశ్న అవసరమా? 50 ఏళ్లలో తండ్రైన అనుభూతి వేరు..: ప్రకాష్ రాజ్
సినిమా కోసం ఇంటర్వ్యూకు రమ్మని కావేరీ ఇష్యూపై ప్రశ్న అడిగేసరికి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఒంటికాలిపై లేచాడు. యాంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మైక్రోఫోన్ తీసి విసిరికొట్టాడు. అయితే ఆపై సారీ చెప్పాడు.
సినిమా కోసం ఇంటర్వ్యూకు రమ్మని కావేరీ ఇష్యూపై ప్రశ్న అడిగేసరికి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఒంటికాలిపై లేచాడు. యాంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మైక్రోఫోన్ తీసి విసిరికొట్టాడు. అయితే ఆపై సారీ చెప్పాడు. ఇదంతా ఓ టీవికి ఇచ్చి ఇంటర్వ్యూలో వెల్లడైంది.
సినిమా సంగతుల గురించి అడుగుతూ వచ్చిన సదరు యాంకర్ ఉన్నట్టుండి తమిళనాడు, కర్ణాటకల మధ్య ముసురుకున్న కావేరీ జల వివాదాల గురించి అడిగింది. దీంతో ప్రకాష్ రాజ్ రెచ్చిపోయాడు. 'సినిమా గురించి మాట్లాడుతున్న ఈ సమయంలో ఈ ప్రశ్న అవసరమా? అంటూ ఎదురు ప్రశ్న వేశాడు. మాట్లాడేందుకు బోలెడు సమస్యలుంటాయి. కానీ కావేరి వివాదంపై తన వద్ద చెప్పించి.. వివాదం రేపాలనుకుంటున్నారా? అని అడిగారు.
అయితే తర్వాత ప్రకాష్‌రాజ్ తమకు క్షమాపణలు చెప్పాడని ఆ చానల్ ప్రకటించింది. కర్ణాటకకు చెందిన ప్రకాష్‌రాజ్ తమిళ సినిమాల ద్వారానే పైకొచ్చాడు. ఈ కావేరి జలాల వివాదం గురించి ప్రకాష్‌రాజ్ స్పందిస్తూ.. శాంతియుతంగా ఉండాలని మాత్రమే సూచిస్తున్నాడు. ఇకపోతే వ్యక్తిగత విషయాలపై ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. 30 ఏళ్ల వయస్సులో తండ్రి అయిన అనుభూతి వేరని, యాభై ఏళ్ళకి ఇప్పుడు కొడుకు పుట్టిన అనుభూతి వేరన్నారు.
50 ఏళ్లలో తనకు అబ్బాయి పుట్టడం ద్వారా తనకూ తన భార్యా కొరియోగ్రాఫర్ పోనీవర్మకూ బంధం మరింత బలపడుతుందన్నారు. తన కూతుళ్లు మూడో బిడ్డకు రాఖీ కడుతుంటే చూసేందుకు ఎంతో ఆనందంగా ఉందని ప్రకాష్ రాజ్ వెల్లడించారు.