అప్పు చెల్లించలేదనీ బోనులో బంధించి కుక్కలతో దాడి...
కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. అప్పు చెల్లించలేదనీ ఓ యజమాని తన వద్ద పని చేసే కార్మికుడిని పెంపుడు కుక్కల బోనులో బంధించి, వాటితో దాడి చేయించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. అప్పు చెల్లించలేదనీ ఓ యజమాని తన వద్ద పని చేసే కార్మికుడిని పెంపుడు కుక్కల బోనులో బంధించి, వాటితో దాడి చేయించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
కర్ణాటక రాష్ట్రానికి చెందిన కిషన్ అనే వ్యక్తి కాఫీ తోటల యజమాని. ఈ కాఫీ తోటల్లో అనేక మంది కార్మికులు దినకూలీలుగా చేస్తున్నారు. వీరిలో హరీష్ (32) అనే కార్మికుడు రూ.4 వేలు అప్పు తీసుకున్నాడు. ఈ అప్పు చెల్లించలేక పోగా, పనికి రాకుండా మానేశాడు. దీంతో ఆగ్రహించిన కిషన్.. హరీష్ కోసం గాలించగా, బాలెలి గ్రామంలోని ఓ దుకాణంలో పనికి చేరినట్టు తెలుసుకున్నాడు.
దీంతో మధు అనే మరో వ్యక్తితో కలిసి బాలెలి గ్రామానికి వెళ్లి హరీష్‌ను అప్పు చెల్లించాల్సిందిగా కోరాడు. తన వద్ద ప్రస్తుతం డబ్బులు లేవని హరీష్ చెప్పడంతో ఇద్దరూ కలిసి అతనిని బలవంతంగా జీపులో ఎక్కించుకుని తీసుకెళ్లి తన పెంపుడు కుక్కల బోనులో వేసి బంధించారు. ఆ తర్వాత కుక్కలతో దాడి చేయించాడు. ఈ శునకాలు కిషన్‌ను తీవ్రంగా గాయపరచడంతో చనిపోతాడని భావించి బయటకు లాగి సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి మైసూరుకు తరలించారు.
హరీష్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. హరీష్‌పై మూడు శునకాలు దాడి చేశాయని, తల, కాళ్లు, చేతులు, మెడపై అతడికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు వెల్లడించారు. కాఫీ తోట యజమాని కిషన్‌పై హత్య కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.