గోరఖ్‌పూర్‌గా మారిన కోలార్.. 90 మంది శిశువుల మరణం.. ఎందుకు?
కర్ణాటక, కోలార్ ప్రాంతంలోని శ్రీ నరసింహ రాజ స్వామి ఆస్పత్రిలో గత 8 నెలల్లో దాదాపు 90 మంది శిశువులు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. తద్వారా ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్ తరహాలే ఈ ఆస్పత్రిలో శిశు
కర్ణాటక, కోలార్ ప్రాంతంలోని శ్రీ నరసింహ రాజ స్వామి ఆస్పత్రిలో గత 8 నెలల్లో దాదాపు 90 మంది శిశువులు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. తద్వారా ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్ తరహాలే ఈ ఆస్పత్రిలో శిశు మరణాలు సంభవించాయి. ఇటీవల యూపీలో చిన్నారుల మృతి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇదే తరహాలో కర్ణాటక, కోలార్ ప్రాంతంలోని శ్రీ నరసింహ రాజ స్వామి ఆస్పత్రిలో జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు 35 మంది చిన్నారులు చనిపోయారు.
దీనిపై జరిగిన విచారణల గత 8 నెలల్లో మరణించిన చిన్నారులు.. ఆక్సిజన్ అందక మరణించలేదని.. తక్కువ బరువుతోనే మరణించారని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ శిశు మరణాలు పెరిగిపోతున్నాయని ఆస్పత్రి అధికారులు తెలిపారు. ఆస్పత్రులు వ్యాపారం చేస్తున్నాయని.. లాభాలను ఆర్జించేందుకు ఆస్పత్రులు పోటీపడుతున్నారని ప్రజల, సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు.