నిత్యం వేలాది వాహనాలు, ప్రజలు తిరిగే జాతీయ రహదారిపై వందల సంఖ్యలో కండోమ్‌లు కనిపించాయి. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక తుముకూర్ శివారులోని జాతీయ రహదారి 48పై వందల సంఖ్యలో కండోమ్‌లు దర్శనమిచ్చాయి.
ఇది చూసి అటుగా వెళ్లే వాహనదారులు షాకయ్యారు. ఏదో యాక్సిడెంట్ జరిగినట్లు ఆపి మరీ చూశారు. శ్రీరాజ్ థియేటర్‌కు ఎదురుగా ఉన్న ఓ ఫ్లైఓవర్‌పై కండోమ్‌లు కుప్పలుగా కనిపించాయి. అయితే ఇవి ఎవరైనా పారేశారా లేక ఏదైనా వాహనంలో తరలిస్తున్నప్పుడు పడిపోయాయో తెలియలేదు.
అయితే ఇందులో కొన్ని వినియోగించిన కండోమ్‌లు ఉండగా.. మరికొన్ని ప్యాకెట్లలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై అధికారులు ఇప్పటివరకు స్పందిచలేదు. నిత్యం రద్దీగా తిరిగే ప్రదేశాల్లోనే ఇలా ఉంటే నిర్జన ప్రాంతాల్లో పరిస్థితేంటని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.