Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విడాకులు తీసుకుని పుట్టింటికి కూతురు.. బ్యాండ్ బాజాతో సాదర స్వాగతం

Advertiesment
Kanpur man celebrates daughter's homecoming after divorce

సెల్వి

, మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (12:00 IST)
పెండ్లి తర్వాత తల్లిదండ్రులు అందరూ తమ కూతుళ్లను ఎంతో ఆర్భాటంగా మెట్టినింటికి పంపిస్తారు కానీ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒక తండ్రి విడాకులు తీసుకున్న తర్వాత తన కుమార్తెను బ్యాండ్‌ వాయిద్యాలతో ఆడంబరంగా ఇంటికి తీసుకువచ్చాడు.
 
"మేము ఆమెను పెళ్లి తర్వాత పంపినట్లే మేము ఆమెను తిరిగి తీసుకువచ్చాము. ఆమె మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నామని బీఎస్ఎన్ఎల్‌లో పనిచేస్తున్న ఆమె తండ్రి అనిల్ కుమార్ చెప్పారు.
 
న్యూఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్ట్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్న అనిల్ కుమార్తె ఉర్వి (36)కి 2016లో కంప్యూటర్ ఇంజనీర్‌తో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఢిల్లీలో ఒక కుమార్తె ఉంది.
 
ఉర్విని అత్తమామలు వరకట్నం కోసం వేధిస్తున్నారని ఆరోపిస్తూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఫిబ్రవరి 28న దంపతులకు విడాకులు మంజూరు చేసింది.

"నేను ఎనిమిదేళ్ల హింసలు, దెబ్బలు, అవహేళనలను భరించిన తర్వాత సంబంధాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నించాను, కానీ చివరికి అది విచ్ఛిన్నమైంది" అని ఆమె చెప్పింది.  అయితే తల్లిదండ్రులు తనకు సాదరంగా ఆహ్వానం పలికారని.. 'బ్యాండ్ బాజా' కోసం ఏర్పాట్లు చేశారని చెప్పింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లోక్‌సభ ఎన్నికలు : తెలంగాణాలో రూ.202 కోట్ల నగదు స్వాధీనం