ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రాజ్ ఘాట్‌లో మౌనదీక్ష చేశారు. ఏపీ విభజన హామీల అమలు కోసం పాల్ 4 గంటలు దీక్ష చేశారు. ఆగస్టు 15లోగా హామీలు అమలు చేయకుంటే ఆమరణ దీక్ష చేస్తానని తెలిపారు. తెలుగు సత్తా చూపకపోతే విభజన హామీలు అమలు కావని చెప్పారు.
కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. మౌన దీక్ష ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అనేక మంది పెద్దలను కోరినా హామీలు అమలు కాలేదన్నారు.
దేవునితో మాట్లాడటానికి 4 గంటలు మౌనదీక్ష చేశానని తెలిపారు. తెలుగు రాష్ట్రాల సీఎంలకు ప్రజాప్రయోజనాలు ముఖ్యం కాదని విమర్శించారు. 20న మరోసారి జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తానని ప్రకటించారు.