Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆర్థిక మందగమనం : కేంద్ర మంత్రివర్గంలోని కేవీ కామత్?

ఆర్థిక మందగమనం : కేంద్ర మంత్రివర్గంలోని కేవీ కామత్?
, ఆదివారం, 19 జనవరి 2020 (10:08 IST)
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం కొనసాగుతోంది. దీనిప్రభావం భారత్‌లో కూడొ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాగా దెబ్బతింది. అనేక కంపెనీలు తమ ఉత్పత్తులను గణనీయంగా తగ్గించివేశారు. అలాగే, నగదు చెలామణీ, లావాదేవీలు కూడా బాగా తగ్గిపోయాయి. వీటన్నింటిన ప్రభావం కారణంగా దేశ వృద్ధిరేటు కూడా ఊహించినదానికంటే తగ్గిపోయింది. 2019-20 సంవత్సరంలో దేశ వృద్ధిరేటు ఐదు శాతం కంటే తక్కువగా నమోదు కావొచ్చని అనేక అంతర్జాతీయ ఆర్థిక సంస్థల సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు వీలుగా బ్రిక్స్ దేశాలకు చెందిన న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఛైర్మన్‌గా ఉన్న కేవీ కామత్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్వరలోనే తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ఈ విస్తరణలో కేవీ కామత్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు వస్తున్నాయి. ఒకవేళ కేవీ కామత్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్న పక్షంలో ఆయన్ను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా కొనసాగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఈయనతో పాటు.. బీజేపీ ఎంపీ స్వప్నదాస్ గుప్తాకు కూడా మంత్రి పదవి లభించనుందనీ, ఆయనకు మానవ వనరుల శాఖ సహాయ మంత్రి పదవి రావచ్చని తెలుస్తోంది. మాజీ మంత్రి సురేశ్ ప్రభుకు కూడా మంత్రి వర్గంలో చోటు లభించే అవకాశాలున్నాయి.
 
కామత్ అనుభవం విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన బ్రిక్స్ కూటమి దేశాల బ్యాంక్ ఛైర్మన్‌గా పనిచేస్తూ విజయపథంలో ముందుకు సాగుతున్నారు. గతంలో ఆయన ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌కు ఛైర్మన్‌గా పనిచేశారు. ఐసీఐసీఐ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, ఎండీ, సీఈవోగా కూడా పనిచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూర్ఖత్వంతో జగన్‌ పతనం: దివాకర్‌రెడ్డి