Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి వరంగా మారిన నేత ఎవరు?

Advertiesment
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి వరంగా మారిన నేత ఎవరు?
, గురువారం, 30 మే 2019 (18:25 IST)
తెలంగాణా ప్రాంతానికి చెందిన నేత జి. కిషన్ రెడ్డి. బీజేపీ సీనియర్ నేత. తెలంగాణ నుంచి ఎంపీలుగా గెలుపొందిన అభ్యర్థుల్లో ఒకరు. ఈ నలుగురిలో సీనియర్‌ కిషన్ రెడ్డి అయినందునా మంత్రివర్గంలో తప్పకుండా చోటు దక్కింది. 
 
రాష్ట్రంలో సికింద్రాబాద్‌ నుంచి ఎంపీగా గెలుపొందిన కిషన్‌రెడ్డి గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అంబర్‌పేట నియోజకవర్గం నుంచి 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 
 
శాసనసభాపక్ష నేతగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. పార్టీలో అనేక పదవులు అలంకరించారు. పార్టీ పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఫలితంగా ఆయనకు కేంద్ర మంత్రిపదవి వరించింది. 
 
ఈ మంత్రి పదవి రావడానికి ప్రధాన కారణం ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడమే. తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఫలితంగా 2018 డిసెంబరు నెలలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి బరిలోకి దిగిన కిషన్ రెడ్డి తెరాస అభ్యర్థి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. 
 
ఈ ఓటమే ఆయనకు ఇపుడు వరంలామారింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేవలం నాలుగు నెలల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కిషన్ రెడ్డికి మళ్లీ పోటీ చేసే అవకాశం బీజేపీ అధిష్టానం కల్పించింది. ఫలితంగా ఆయన సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడుపై 60 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఫలితంగా దేశ ప్రధానిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ మంత్రివర్గంలో ఆయన మంత్రిపదవి దక్కింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లైన నాటి నుంచి వేధింపులే.. భర్త తలను నరికి పోలీస్ స్టేషన్‌కు వెళ్ళింది..