Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేరాలకు అడ్డాగా మారిన యూపీ.. విలేకరి సజీవదహనం

Advertiesment
నేరాలకు అడ్డాగా మారిన యూపీ.. విలేకరి సజీవదహనం
, సోమవారం, 30 నవంబరు 2020 (11:00 IST)
ఉత్తరప్రదేశ్ నేరాలకు అడ్డాగా మారిపోయింది. యూపీలోని బలరామ్‌పుర్‌లో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. రాకేష్​ సింగ్​ నిర్భిక్​ అనే ఓ స్థానిక విలేకరి ఇంటికి దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనలో విలేకరితో పాటు అతని స్నేహితుడు.. సజీవ దహనమయ్యారు. ఆ సమయంలో విలేకరి భార్య, పిల్లలు తమ బంధువుల ఇంటికి వెళ్లగా వారికి ప్రాణాపాయం తప్పింది.
 
ఈ నేరానికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నాలుగు బృందాలు అనుమానితులను ప్రశ్నిస్తున్నాయని, ఘటనాస్థలి నుంచి సాక్ష్యాలను సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆర్థిక భరోసా కింద జిల్లా యంత్రాంగం జర్నలిస్టు భార్యకు రూ.5 లక్షల చెక్కును అందజేసింది. బలరాంపుర్​ చక్కెర కర్మాగారంలో ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌లో విజృంభిస్తోన్న కోవిడ్.. 24 గంటల్లో 38,772 కేసులు