జేఎన్‌యూ విద్యార్థినిపై ఆప్ఘన్ యువకుల రేప్.. టీచర్‌పై హెడ్మాస్టర్ బలాత్కారం
దేశ రాజధాని ఢిల్లీతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మూడు అత్యాచార ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ బాధితుల్లో ఒకరు జేఎన్‌యూ విద్యార్థిని కాగా, మరొకరు మహిళా ఉపాధ్యాయురాలు. మరో కేసులో డిగ్రీ విద్యార్
దేశ రాజధాని ఢిల్లీతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మూడు అత్యాచార ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ బాధితుల్లో ఒకరు జేఎన్‌యూ విద్యార్థిని కాగా, మరొకరు మహిళా ఉపాధ్యాయురాలు. మరో కేసులో డిగ్రీ విద్యార్థిని. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
ఢిల్లీలో జరిగిన ఘటనను పరిశీలిస్తే.. గతవారం పార్టీకి వెళ్లిన జేఎన్‌యూ విద్యార్థిని(21)పై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇద్దరు ఆప్ఘనిస్థాన్ పౌరులు ఆమెకు బలవంతంగా మద్యం తాగించి ఈ దుశ్చర్యకు పూనుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వారిని పోలీసులు అరెస్టు చేశారు.
అలాగే, మధ్యప్రదేశ్‌లో దేవాస్ జిల్లాలోని సత్వాస్ పట్టణంలో ప్రభుత్వ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు బాబూఖాన్.. అదే స్కూల్లో గెస్ట్ టీచర్‌గా పని చేస్తున్న యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
రాజస్థాన్‌లో ఓ డిగ్రీ విద్యార్థినిని ఐదుగురు యువకులు కిడ్నాప్ చేశారు. జుంజునూ జిల్లా బగాద్ ప్రాంతం నుంచి యువతిని ఓ జీప్‌లో ఎక్కించుకొని వాహనంలోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేశారు.