Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబు చేతిలో 'ఔట్ గోయింగ్' మంత్రుల చిట్టా.. ఏ క్షణమైనా బుగ్గకార్లు తొలగింపు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలోని పలువురికి ఉద్వాసన పలకాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. ఇందుకోసం ఆయన ఓ జాబితాను తయారు చేశారు. ఔట్ గోయింగ్ మినిస్టర్స్ పేరుత

Advertiesment
చంద్రబాబు చేతిలో 'ఔట్ గోయింగ్' మంత్రుల చిట్టా.. ఏ క్షణమైనా బుగ్గకార్లు తొలగింపు!
, శనివారం, 21 జనవరి 2017 (13:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలోని పలువురికి ఉద్వాసన పలకాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. ఇందుకోసం ఆయన ఓ జాబితాను తయారు చేశారు. ఔట్ గోయింగ్ మినిస్టర్స్ పేరుతో తయారు చేసిన జాబితాలో ఐదుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 
 
వీరిలో మంత్రి రావెల కిషోర్ బాబు, పత్తిపాటి పుల్లారావు, పల్లె రఘునాథ రెడ్డి (టీడీపీ), శిద్ధా రాఘవరావు (బీజేపీ)ల పేర్లతో పాటు.. మరో ఇద్దరు పేర్లు ప్రముఖంగా ఉన్నాయి. అలాగే, మరికొంతమంది మంత్రుల శాఖలను మార్పు చేయాలన్న ఆలోచనలో బాబు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ మంత్రుల తొలగింపుపై ఏ క్షణమైనా అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఇప్పటికే మూడేళ్లు పూర్తయిపోయిన మంత్రివర్గంలోకి కొత్తదనాన్ని తీసుకొచ్చే చర్యలతో పాటు తాను ఆశించిన మేరకు ప్రగతి సాధించలేక వెనుకబడిన మంత్రులను తొలగించి వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. అప్పట్లో మంత్రివర్గంలో బెర్తులు ఇవ్వడానికి చంద్రబాబు కులాల వారీగా బేరీజు వేసేవారు. కానీ, ఇప్పుడది పాతబడిపోయింది కాబట్టి కొత్తవాళ్లని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని కూడా ఆపార్టీ వర్గాల నుంచి వినిపిస్తోన్నమాట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇష్టంతో చేయించుకున్న సెక్స్‌ను ఏ ఆడపిల్లా రేప్ అని అనదు : బాంబే హైకోర్టు