Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మ ఆరోగ్యం క్షీణించేంతవరకు ఎందుకు ఆస్పత్రిలో చేర్చలేదు.. వీడని మిస్టరీ..?!

దివంగత సీఎం జయలలిత మృతి ప్రస్తుతం మిస్టరీగా మారింది. జయలలిత చికిత్స.. ఆమె మృతికి సంబంధించి అపోలో ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి సహా లండన్ వైద్యుడు రిచర్డ్స్ బాలే, ఎయిమ్స్ వైద్యుల బృందం సుదీర్ఘ వివరణ ఇచ్చిం

అమ్మ ఆరోగ్యం క్షీణించేంతవరకు ఎందుకు ఆస్పత్రిలో చేర్చలేదు.. వీడని మిస్టరీ..?!
, బుధవారం, 8 మార్చి 2017 (12:27 IST)
దివంగత సీఎం జయలలిత మృతి ప్రస్తుతం మిస్టరీగా మారింది. జయలలిత చికిత్స.. ఆమె మృతికి సంబంధించి అపోలో ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి సహా లండన్ వైద్యుడు రిచర్డ్స్ బాలే, ఎయిమ్స్ వైద్యుల బృందం సుదీర్ఘ వివరణ ఇచ్చింది. తాజాగా ఎఐఎడిఎంకె చీలిక వర్గమైన పన్నీర్ సెల్వం బృందం జయ మృతిపై విచారణ చేపట్టాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేసింది. కానీ ఆస్పత్రివర్గాలిచ్చిన మెడికల్ రిపోర్ట్ పలు అనుమానాలకు తావిస్తోంది. 
 
అందరిమదిలోనూ అనుమానాలకు తావిస్తున్న అంశం ఏంటంటే.. జయను ఆస్పత్రికి తీసుకెళ్లకముందు పోయెస్ గార్డెన్‌లో ఏంజరిగింది? అపోలో వైద్యులు ప్రెస్ మీట్‌లో చెప్పిన దాని ప్రకారం ముఖ్యమంత్రి జయలలిత కనీసం మాటకూడా మాట్లాడలేని స్థితిలో ఆస్పత్రిలో చేరారని.. ఆస్పత్రిలో జాయిన్ అయ్యే సమయానికే ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందన్నారు. తామిచ్చిన 75 రోజుల చికిత్సవల్లే ఆమె ఆరోగ్యం కుదటపడిందని, అయితే, సడన్ హాట్ స్ట్రోక్ వల్ల ఆమె చనిపోయారని చెప్పుకొచ్చారు.
 
ఇదే ఇప్పుడు కీలకాంశంగా మారింది. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆరోగ్యం అంతగా క్షీణించేంతవరకూ ఆస్పత్రిలో ఎందుకు చేర్పించలేదనే అంశంపై ఓపీఎస్ వర్గం ఫైర్ అవుతోంది. అంతేగాకుండా పోయెస్ గార్డెన్‌లో జయను తోయడం వల్ల ఆమె కింద పడ్డారని కూడా వైద్యుల నివేదిక చెబుతోంది. అయితే, జయను ఎవరు తోశారన్నది మిస్టరీగానే ఉంది. పోయెస్ గార్డెన్‌లో ఉన్న జయలలితకు డయాబెటిస్, హైపర్ టెన్షన్, వంటి వాటికి ఇచ్చిన ట్రీట్మెంట్‌పై కూడా అనుమానాలున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మ మృతిపై సీబీఐతో విచారణకు డిమాండ్.. మెరీనాలో ఓపీఎస్ నిరాహార దీక్ష.. జల్లికట్టు తరహాలో?