Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మ ఔటాఫ్ డేంజర్... జయలలిత కోసం ఎయిమ్స్‌ వైద్యులు.. లండన్ వైద్యుడు

గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ప్రాణభయం లేదని వైద్యులు వెల్లడించారు. అదేసమయంలో ఆమెకు మరింతగా మెరుగైన వైద్య సేవలు అందిచేందుకు ఢిల్లీ

Advertiesment
అమ్మ ఔటాఫ్ డేంజర్... జయలలిత కోసం ఎయిమ్స్‌ వైద్యులు.. లండన్ వైద్యుడు
, గురువారం, 6 అక్టోబరు 2016 (08:02 IST)
గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ప్రాణభయం లేదని వైద్యులు వెల్లడించారు. అదేసమయంలో ఆమెకు మరింతగా మెరుగైన వైద్య సేవలు అందిచేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులతో పాటు.. లండన్‌కు చెందిన డాక్టర్ బీలే కూడా మరోమారు చెన్నైకు వస్తున్నారు. ఎయిమ్స్ వైద్యులు ఇప్పటికే చెన్నైకు చేరుకున్నారు. వీరిలో కార్డియాలజిస్టు డాక్టర్‌ నాయక్‌, పల్మనాలజీ నిపుణుడు కిర్మాణీ, అనెస్థటిక్‌ ఇంటెన్సివిస్ట్‌ డాక్టర్‌ అంజన్‌ ఉన్నారు. లండన్‌ వైద్యుడు డాక్టర్‌ రిచర్డ్‌ బీలే కూడా గురువారం చెన్నైకు తిరిగి రానున్నారు. 
 
మరోవైపు... జయలలితకు ప్రాణాపాయ స్థితి తప్పినట్లేనని విశ్వసనీయవర్గాల సమాచారం. ఆమె ఊపిరితిత్తులకు సోకిన ఫంగల్‌ ఇనఫెక్షన్ తగ్గుముఖం పట్టినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. మరో రెండు వారాల చికిత్స అనంతరం ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసే అవకాశమున్నట్లు వైద్యులు చెబుతున్నారు. 
 
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత దగ్గరకు అతి కొద్దిమందినే అనుమతిస్తున్నట్లు సమాచారం. జయ సన్నిహితురాలు శశికళ, ఆమె మరదలు ఇళవరసి, శశికళ తమ్ముడు దివాకరన్‌లు మాత్రమే దగ్గరుండి ఆమె బాగోగులు చూసుకుంటున్నట్లు తెలిసింది. జయ వద్దకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామమోహనరావ్‌, సలహాదారు షీలాబాలకృష్ణనకు తప్ప ఇతరులెవ్వరికీ అనుమతి లేదని సమాచారం. 
 
మరోవైపు కొంతకాలంగా ఆహారం తీసుకోకపోవడం, ఇనఫెక్షన్‌ను నియంత్రించేందుకు అధికమోతాదులో మందులు వాడుతుండటం వల్ల జయలలిత బాగా బరువు తగ్గే అవకాశమున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. జయ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయినప్పటికీ 2 నెలలు విశ్రాంతి అవసరమని వైద్యులు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దుర్గ గుడికి ఛైర్మ‌న్‌ని వేశారా? నాకు తెలియ‌దే... దేవాదాయ‌శాఖ మంత్రి, ఛీ...ఛీ... పరువు తీయకండి