Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దుర్గ గుడికి ఛైర్మ‌న్‌ని వేశారా? నాకు తెలియ‌దే... దేవాదాయ‌శాఖ మంత్రి, ఛీ...ఛీ... పరువు తీయకండి

విజ‌య‌వాడ ‌: దుర్గ గుడికి ఛైర్మ‌న్‌గా గౌరంగ‌బాబుని నియ‌మించార‌ట‌... నాకు తెలీదు... నేనూ పేప‌ర్లో చ‌దివా అని సాక్షాత్తు దేవాదాయ‌శాఖ మంత్రి చెప్పారు. దీనితో ఏపీలో బీజేపీకి, ఆ పార్టీ మంత్రుల‌కు టీడీపీ అధిష్ఠానం ఎంత విలువ ఇస్తోందో అర్థం అయిపోతుంది. మంత్ర

Advertiesment
AP BJP leaders
, బుధవారం, 5 అక్టోబరు 2016 (21:30 IST)
విజ‌య‌వాడ ‌: దుర్గ గుడికి ఛైర్మ‌న్‌గా గౌరంగ‌బాబుని నియ‌మించార‌ట‌... నాకు తెలీదు... నేనూ పేప‌ర్లో చ‌దివా అని సాక్షాత్తు దేవాదాయ‌శాఖ మంత్రి చెప్పారు. దీనితో ఏపీలో బీజేపీకి, ఆ పార్టీ మంత్రుల‌కు టీడీపీ అధిష్ఠానం ఎంత విలువ ఇస్తోందో అర్థం అయిపోతుంది. మంత్రి వ్యాఖ్య‌ల‌తో ఆగ్ర‌హం చెందిన బీజేపీ కార్యకర్తలు ఆయ‌న రాజీనామాకు డిమాండ్ చేశారు. 
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు చంద్రబాబు క్యాబినెట్‌లో ఏమాత్రం విలువ లేక‌పోయినా కొన‌సాగుతున్నార‌ని, ఈ విష‌యాన్ని ఆయ‌నే వెల్లడించారని బీజేపీ నాయ‌కులు పేర్కొన్నారు. ఏపీలో బీజేపీ పరువు తీవ్రంగా కోల్పోయిందని, మంత్రి వెంటనే రాజీనామా చెయ్యాలని విజ‌య‌వాడ బీజేపీ నాయ‌కులు డిమాండ్ చేస్తున్నారు.
 
విజయవాడలో మాణిక్యాలరావు మీడియాతో మాట్లాడుతూ, క‌నకదుర్గ ఆలయ పాలకమండలి నియామకం గురించి తనకు తెలియదని, తాను కూడా పేపర్లలో చదివానని చెప్పటం చూస్తే... ఆయనకు ఏమాత్రం ఆ శాఖలో గౌరవం ఉందో తెలిసిపోయిందని, ఇకనైనా వెంటనే రాజీనామా చేసి పేపర్లు చదువుకోవాలని ఎద్దేవా చేస్తున్నారు.
 
దేవాలయ శాఖ మంత్రిగా జీర్ణాలయాలను సీ.జి.ఎఫ్ నిధులతో అభివృద్ధి చేయాల్సి ఉండ‌గా, పుష్కరాలకు ముందు అనేక ఆలయాలు విచక్షణ లేకుండా కూల్చివేశార‌ని దేవాదాయ‌శాఖ మంత్రిపై బీజేపీ నేత‌లు చిందులు తొక్కుతున్నారు. అనుకోని విధంగా లభించిన మంత్రి పదవి కోసం బీజేపీ పాలసీలను తాకట్టుపెట్టవద్దని, పదవే కావాలనుకుంటే టీడీపీలో చేరితే ఎవరికి అభ్యంతరం ఉండదని విమ‌ర్శిస్తున్నారు. ఛీ.. ఛీ.. మరీ పేపర్లో చదివి మీ శాఖలో ఏమి జరుగుతుందో తెలుసుకునే స్థాయిలో బీజేపీ మంత్రిగా ఉండి, పార్టీ పరువు తీయవద్దని డిమాండ్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''అమ్మ'' వారసుడిగా అజిత్.. తమిళనాట జోరుగా ప్రచారం.. రజనీకాంత్ రానని చెప్పడంతో?