Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

''అమ్మ'' వారసుడిగా అజిత్.. తమిళనాట జోరుగా ప్రచారం.. రజనీకాంత్ రానని చెప్పడంతో?

తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యం పాలై 15 రోజుల పాటు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో.. అమ్మకు వారసుడెవరనే దానిపై తమిళనాట చర్చ సాగుతోంది. అపోలో ఆసుపత్రిలో జ్వరం, డీహైడ్రేషన్ కారణంగా చేరిన అమ

''అమ్మ'' వారసుడిగా అజిత్.. తమిళనాట జోరుగా ప్రచారం.. రజనీకాంత్ రానని చెప్పడంతో?
, బుధవారం, 5 అక్టోబరు 2016 (19:09 IST)
తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యం పాలై 15 రోజుల పాటు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో.. అమ్మకు వారసుడెవరనే దానిపై తమిళనాట చర్చ సాగుతోంది. అపోలో ఆసుపత్రిలో జ్వరం, డీహైడ్రేషన్ కారణంగా చేరిన అమ్మ ప్రస్తుతం చికిత్సకు స్పందిస్తున్నారని ఆస్పత్రి యాజమాన్యం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. అయినా ఆమె ఆరోగ్యంపై ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రతిపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఆమె పరిస్థితి ఎలా ఉందో ఆస్పత్రిలో అమ్మ చికిత్స పొందుతున్న ఫోటోలను విడుదల చేయాలని డీఎంకే అధినేత కరుణానిధి కూడా డిమాండ్ చేశారు. కానీ అమ్మ ఆరోగ్యంపై అపోలో యాజమాన్యం ఫోటోలు విడుదల చేయకుండా బులిటెన్ మాత్రం ప్రతిరోజూ విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలో అమ్మ రాజకీయ వారసులు ఎవరనే విషయమై తమిళనాట ఇప్పుడు చర్చ ప్రారంభమైంది. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంజీ రామచంద్రన్ చనిపోయాక 1989లో ఆ పార్టీ పగ్గాలు జయలలిత చేపట్టారు.
 
అప్పటి నుంచి ఈనాటి వరకు పార్టీలో జయలలిత ఎదురులేని నాయకురాలిగా ఏకఛత్రాధిపత్యంతో పార్టీని సమర్థవంతంగా నడిపారు. తన ముందు సాగిలపడే కార్యకర్తలకు పురుచ్చితలైవి అమ్మగా, తమిళ ప్రజల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటూ పాలన సాగించుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మ వారసులు ఎవరంటే.. అజిత్ పేరు వినిపిస్తుంది. సినిమాల్లోనూ, వ్యక్తిగతంగా క్లీన్ అయిన హ్యాండ్ సమ్ హీరో అజిత్‌నే అమ్మ వారసులుగా ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తుందని.. ఇందులో భాగంగా చర్చలు కూడా జరుపుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 
 
అంతకంటే ముందు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ పేరు వినబడినా.. ఆయన రాజకీయాల్లోకి రానని తెగేసి చెప్పేయడంతో మంచి యూత్ ఫాలోయింగ్ ఉన్న అజిత్‌ను అన్నాడీఎంకే పార్టీ నాయకుడిగా నియమించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో ఏమో అనే దానిపై మరికొంతకాలం వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సర్జికల్స్ స్ట్రైక్స్‌‌ మాటెత్తని నవాజ్ షరీఫ్: యుద్ధం వద్దు.. శాంతే ముద్దు.. పొలాల్లోకి యుద్ధ ట్యాంకర్లు తీసుకెళ్తే?