Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేదనిలయం నుంచి ఖాళీ చేయించండి.. పన్నీర్ ఆదేశాలు.. తట్టా బుట్టా సర్దుకుని చిన్నమ్మ వెళ్ళిపోయారా?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి అనంతరం తమిళ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న శశికళకు ఆరాష్ట్ర అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చుక్కలు చూపిస్తున్నారు. జయమ్మ మృతికి తర్వాత పోయె

Advertiesment
వేదనిలయం నుంచి ఖాళీ చేయించండి.. పన్నీర్ ఆదేశాలు.. తట్టా బుట్టా సర్దుకుని చిన్నమ్మ వెళ్ళిపోయారా?
, శనివారం, 11 ఫిబ్రవరి 2017 (16:28 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి అనంతరం తమిళ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న శశికళకు ఆరాష్ట్ర అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చుక్కలు చూపిస్తున్నారు. జయమ్మ మృతికి తర్వాత పోయెస్ గార్డెన్‌లో మకాం వేసి చక్రం తిప్పుతున్న శశికళను వేద నిలయం నుంచి గెంటేయడానికి పన్నీర్ సెల్వం రంగం సిద్ధం చేస్తున్నారు. 
 
ఇందులో భాగంగా జయలలితకు ప్రాణమైన చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లోని వేదనిలయం నుంచి శశికళను తరిమికొట్టాలని పన్నీర్ డిసైడైపోయారు. 2016 డిసెంబర్ 5వ తేది జయలలిత మరణించిన తరువాత వేదనిలయంలో శశికళ, మన్నార్ గుడి మాఫియా సభ్యులు మకాం వేశారు. అక్కడి నుంచే శశికళ కూడా అన్నాడీఎంకేలో చక్రం తిప్పారు.
 
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. చివరికి సీఎం కావాలని పన్నీర్ సెల్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి ఆయనతో రాజీనామా చేయించారు. అయితే చిన్నమ్మపై పన్నీరు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అంతటితో ఆగకుండా పోయెస్ గార్డెన్‌లోని వేదనిలయం జయలలిత స్మారక భవనం చేస్తామని ప్రకటించారు. చెప్పిన మాట ప్రకారం శనివారం మధ్యాహ్నం వేదనిలయం ఖాళీ చేయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 
 
పన్నీర్ సెల్వం నిర్ణయంపై జయలలిత అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పన్నీర్ సెల్వం ఆదేశాల నేపథ్యంలో చిన్నమ్మ వేద నిలయం నుంచి వెళ్ళిపోయేందుకు వీలుగా తట్టాబుట్టా సర్దేసుకుని.. గవర్నర్‌తో భేటీ కావాలనే సాకుతో వెళ్ళిపోయారని టాక్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నాడీఎంకేలో కొత్త ట్విస్ట్ : సీఎం అభ్యర్థిగా శశికళ ఔట్.. తెరపైకి మరోనేత?