శశికళను అమ్మ ఆత్మ పట్టుకుందా? సీఎం అన్నందుకు కసి తీర్చుకుందా?
తమిళనాడులో గత నెల రోజులుగా శశికళ పేరు మారుమోగిపోయింది. ఇప్పటికీ మోగుతూనే వుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇంటికి ఓ వీడియోగ్రాఫర్‌గా ఎంట్రీ ఇచ్చుకున్న శశికళ, జయలలిత మరణానంతరం ఏకంగా పార్టీ పగ్గాలు చేపట్టడమే కాకుండా ముఖ్యమంత్రి పదవిని సైతం ఆక్రమించేందుక
తమిళనాడులో గత నెల రోజులుగా శశికళ పేరు మారుమోగిపోయింది. ఇప్పటికీ మోగుతూనే వుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇంటికి ఓ వీడియోగ్రాఫర్‌గా ఎంట్రీ ఇచ్చుకున్న శశికళ, జయలలిత మరణానంతరం ఏకంగా పార్టీ పగ్గాలు చేపట్టడమే కాకుండా ముఖ్యమంత్రి పదవిని సైతం ఆక్రమించేందుకు చేయని ప్రయత్నాలు లేవు. ఐతే అనూహ్యంగా ఆమె అక్రమాస్తుల కేసులో ఇరుక్కుపోయి జైలుపాలు కావాల్సి వచ్చింది.
శశికళ ముఖ్యమంత్రి పదవి కోసం పోరాడటం, పార్టీ పగ్గాలను లాగేసుకోవడం తదితర విషయాల పట్ల జయలలిత ఆత్మ ఘోషించిందనీ, ఆమెను అన్నాడీఎంకే పార్టీ నుంచే కాకుండా ముఖ్యమంత్రి పదవి కూడా దక్కకుండా జయ ఆత్మ చేసిందంటూ తమిళనాడులో చర్చ నడుస్తోంది. అమ్మ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు శశికళను పార్టీ నుంచి బహిష్కరించి ఆ తర్వాత మళ్లీ అక్కున చేర్చుకున్న సంగతి తెలిసిందే. ఐతే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపధ్యంలో జయలలిత ఆత్మ శశికళపై కసి తీర్చుకున్నదంటూ సోషల్ మీడియాలో కామెంట్లు కనబడుతున్నాయి.