Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బంగ్లాదేశ్‌లోని భారతీయుల ప్రయోజనాలే ముఖ్యం : భారత్

Advertiesment
Jaishankar

ఠాగూర్

, శుక్రవారం, 9 ఆగస్టు 2024 (09:17 IST)
బంగ్లాదేశ్‌లోని భారతీయుల ప్రయోజనాలే తమకు ముఖ్యమంత్రి, ఆ దేశంలో నివసిస్తున్న భారతీయ ప్రజల భద్రతపై సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నట్టు భారత విదేశాంగ మంత్విత్వ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లు అంశం పెను చిచ్చురేపింది. ఫలితంగా ఆ దేశ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. పైగా, ఆమె ఏకంగా దేశాన్ని వీడాల్సి వచ్చింది కూడా. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. 
 
మరోవైపు, బంగ్లాదేశ్‌లో హింసాత్మక సంఘటనలు చెలరేగాయి. ఆ దేశంలోని మైనార్టీ హిందువులపై దాడులు జరుగుతున్నాయి. హిందూ యువతులు, మహిళలపై బంగ్లా పౌరులు అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. బంగ్లాలోని హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటినీ భారత విదేశాంగ శాఖ బేరీజు వేస్తుంది. ఈ తాజా పరిణామాలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది.
 
బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలే భారత్‌కు ముఖ్యమని వెల్లడించింది. బంగ్లాదేశ్‌లో మైనారిటీ వర్గాలపై దాడుల ఘటనలను గమనిస్తున్నామని తెలిపింది. బంగ్లాదేశ్‌లోని భారతీయుల భద్రతపై అధికారులను సంప్రదిస్తున్నామని విదేశాంగ శాఖ పేర్కొంది. పొరుగుదేశంలో శాంతిభద్రతల పునరుద్ధరణ త్వరగా జరగాలని ఆశిస్తున్నామని తెలిపింది. బంగ్లాదేశ్‌లో ఇప్పటికీ ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయని, ఇది ఆందోళన కలిగించే అంశమని వెల్లడించింది. ఇక, ప్రధాని పదవికి రాజీనామా చేసి ఢాకా నుంచి భారత్ వచ్చిన షేక్ హసీనా ఎప్పుడు భారత్‌ను వీడుతారనేది చెప్పలేమని, షేక్ హసీనా భవిష్యత్ ప్రణాళిక గురించి తెలియదని విదేశాంగ శాఖ వివరించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతి - శ్రీశైలం భూముల రెన్యువల్ అంశం సీఎం దృష్టికి : పవన్