భారతీయ స్వీట్ వంటకాల్లో ఒకటైన రసమలై వంటకానికి విశిష్ట గుర్తింపు లభించింది. ప్రపంచంలోనే రెండో వంటకంగా గుర్తింపు లభించింది. ప్రపంచ వ్యాప్తంగా టాప్-10 డిజర్ట్స్ జాబితాను టేస్ట్ అట్లాస్ అనే సంస్థ తాజాగా విడుదల చేసింది. ఇందులో రసమలైకు విశిష్ట గుర్తింపు లభించింది. పోలెండ్‌కు చెందిన సెర్నిక్ స్వీట్‌కు ప్రథమ స్థానం లభించింది. భోజనం సందర్భంగా ఆరగించే స్వీట్లలో రసమలై ఒకటి.
రసమలై ఓ బెంగాలీ వంటకం. బెంగాల్‌లో ఓ మూలకు వెళ్లినా రసమలై స్వీట్ నోరూరిస్తూ స్వాగతం పలుకుతుంది. దీని తయారీలో ప్రధానంగా పాలు ఉపయోగిస్తారు. చక్కెర, కుంకుమ పువ్వు, నిమ్మరసం రసమలై తయారీలో ఉపయోగిస్తారు. ఈ సంస్థ తయారు చేసిన జాబితాలో పోలెండ్‌కు చెందిన సెర్నిక్ వంటకం ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. సెర్నిక్ వంటకాన్ని కోడిగుడ్లు, చక్కెరతో తయారు చేస్తారు. సెర్నిక్ కూడా ఒక రకమైన చీజ్ వంటి డిజర్ట్ వంటకమే.
అలాగే, టేస్ట్ అట్లాస్ తయారు చేసిన టాప్ 10 డిజర్ట్‌ల జాబితాలో సెర్నిక్, రసమలైల తర్వాత గ్రీస్‌కు చెందిన స్ఫకియానోపిటా, అమెరికాకు చెందిన న్యూయార్క్ చీజ్, జపాన్‌కు చెందిన జపనీస్ చీజ్, స్పెయిన్‌కు చెందిన బాస్క్ చీజ్, హంగేరికి చెందిన రాకోజీ టురోస్, గ్రీస్‌కు చెందిన మెలోపిటా, జర్మనీకి చెందిన కుసెకుచెన్, చెక్ రిపబ్లిక్‌కు చెందిన మిసారెజీ స్వీట్లు వరుస స్థానాల్లో నిలిచాయి.