Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విడిచిపెడితే చిటికెలో ధ్వంసం చేసి వస్తాం.. పాకిస్థాన్‌కు అంత సీన్ లేదు : భారత సైనికులు

యురీ ఉగ్రదాడిలో 18 మంది భారత సైనికులు చనిపోవడంతో సైన్యంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ప్రతీకారేచ్చతో రగిలిపోతోంది. రాజకీయనాయకులు తమ చేతులను కట్టేస్తున్నారనేది మెజార్టీ సైనికుల అభిప్రాయం.

విడిచిపెడితే చిటికెలో ధ్వంసం చేసి వస్తాం.. పాకిస్థాన్‌కు అంత సీన్ లేదు : భారత సైనికులు
, శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (13:44 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని యురీ ఉగ్రదాడిలో 18 మంది భారత సైనికులు చనిపోవడంతో సైన్యంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ప్రతీకారేచ్చతో రగిలిపోతోంది. రాజకీయనాయకులు తమ చేతులను కట్టేస్తున్నారనేది మెజార్టీ సైనికుల అభిప్రాయం. రిటైర్డ్ సైనికులు సైతం కదం తొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. కరుడుగట్టిన ఉగ్రవాదులు హఫీసయ్యద్ లాంటి వారిని లేపేస్తామంటున్నారు. 
 
పాకిస్థాన్ భూభాగంలోకి చొరబడి ఉగ్రవాదులను ఏరివేస్తామంటోంది. సరిహద్దు రేఖను దాటి వెళ్లి పాక్ సైన్యం ఉగ్రవాదులపై దాడి చేశారంటేనే ఎంత కసి ఉందో అర్థం చేసుకోవచ్చు. పని ముగించుకుని కామ్‌గా మనదేశానికి వచ్చేశారు. నియంత్రణ రేఖ వెంబడి తుపాకీలను పేల్చారు. టార్గెట్లపై దాడులు చేయడంలోనూ పదాదిదళంలో భారత సైన్యం ఆరి తేరిపోయింది.
 
ప్రపంచంలోనే టాప్ పొజిషన్‌లో ఉంది. మన సైన్యం ముందు పాక్ బలాలు దిగదుడుపే. భారత సైన్యం వద్ద అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. పాక్‌కు అంతసీన్ లేదు. భారత్‌లోని టార్గెట్‌లను సెలక్ట్ చేసుకున్నామని పాక్‌సైన్యం వారం క్రితమే గొప్పలు చెప్పుకున్నా అవి మీడియాలో వార్తలకే పరిమితం అయ్యాయి. పాక్ సైన్యానికి అంతసీన్ లేదన్న విషయం అందరికీ తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవాజ్ షరీఫ్ అంత సీన్ లేదు.. మోడీకి-షరీఫ్‌కు ఓ సందేశం ఇస్తా.. మార్చ్‌కు రెడీ..