Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నవాజ్ షరీఫ్ అంత సీన్ లేదు.. మోడీకి-షరీఫ్‌కు ఓ సందేశం ఇస్తా.. మార్చ్‌కు రెడీ..

పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై ఆ దేశ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైనికులు చేసిన మెరుపు దాడులపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంల

Advertiesment
I will show Nawaz Sharif how to respond to Modi
, శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (13:31 IST)
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై ఆ దేశ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైనికులు చేసిన మెరుపు దాడులపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో అజ్మీర్ దర్గా చీఫ్ సయ్యద్ జైనుల్ అబేదిన్ ఇండియన్ ఆర్మీ దాడులపై హర్షం వ్యక్తం చేశారు. ఇండియన్ ఆర్మీ శత్రుదేశంలో చొరబడి, విజయవంతంగా ఉగ్రవాదులను హతమార్చిందని కొనియాడారు. ఇండియన్ ఆర్మీ పాకిస్థాన్ ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పిందని కితాబిచ్చారు. 
 
మరోపైవు ప్రధాని నవాజ్ షరీఫ్‌కు పాలనా దక్షత లేదని, భారత్ సర్జికల్ స్ట్రయిక్స్‌పై ఎలా స్పందించాలో ఆయనకు తాను చెబుతానని పాక్ మాజీ క్రికెటర్, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్ ఇమ్రాన్‌ఖాన్ విమర్శలు గుప్పించారు. నవాజ్ షరీఫ్‌కు ప్రాథమికంగా ఓ సందేశం ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పిన ఇమ్రాన్ భారత ప్రధాని నరేంద్రమోడీకి కూడా శుక్రవారం ఓ సందేశం పంపిస్తానన్నారు. తాను చేపట్టబోయే మార్చ్‌లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఐక్యత చూపాలని కోరారు. ప్రస్తుతం పాకిస్థాన్‌కు ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
 
ఇదిలా ఉంటే పాక్ చెరలో ఉన్న భారత సైనికుడిని విడిపించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. భారత జవాను పాక్ దళాల నిర్బంధంలో ఉన్నాడంటూ మీడియాలో వచ్చిన కథనాలను పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు. 37 పీఆర్ విభాగానికి చెందిన జవాను గురువారం నియంత్రణ రేఖ దాటి వెళ్లినట్టు, దీనిపై పాక్ దళాలకు డీజీఎంవో టెలిఫోన్ ద్వారా తెలియజేసినట్టు సైనిక వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ -పాక్ యుద్ధం స్టార్ట్: బలగాల మొహరింపు ముమ్మరం.. ఆర్మీ అధికారుల సెలవులు రద్దు