Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత మ్యాప్‌లో చాలా నదులు ఉన్నాయి.. నీళ్లు మాత్రం లేవు.. ఏం చేద్దాం..

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నీటి కొరతపై నోరెత్తారు. భారతదేశ మ్యాప్‌లో చూసేందుకు చాలా నదులున్నాయి. కానీ వాటిలో నీళ్లు మాత్రం లేవని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, గతేడాది డిసెంబరు 11న అమర్‌కంటక్‌లో ప్ర

భారత మ్యాప్‌లో చాలా నదులు ఉన్నాయి.. నీళ్లు మాత్రం లేవు.. ఏం చేద్దాం..
, మంగళవారం, 16 మే 2017 (13:44 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నీటి కొరతపై నోరెత్తారు. భారతదేశ మ్యాప్‌లో చూసేందుకు చాలా నదులున్నాయి. కానీ వాటిలో నీళ్లు మాత్రం లేవని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, గతేడాది డిసెంబరు 11న అమర్‌కంటక్‌లో ప్రారంభమైన యాత్ర 5 నెలలపాటు 1100 గ్రామాలు, పట్టణాల గుండా 3,344 కిలోమీటర్ల మేర సాగింది.

మధ్యప్రదేశ్‌లోని అన్నుప్పుర్ జిల్లా ''నమామి దేవి నర్మదే సేవా యాత్ర'' ముగింపు కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తూ.. నర్మదా నదిపై సర్వహక్కులున్నాయని తెలిపారు. ఈ హక్కులను ఆధారం చేసుకుని నీటిని కొల్లగొట్టామన్నారు. 
 
ఆ నదీమతల్లి మన తాతముత్తాలకు జీవితాన్ని ప్రసాదించిందని.. మన పూర్వీకులను కాపాడిందని మోడీ అన్నారు. అయితే ఆ నదిని మనం ఇప్పుడు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గుజరాత్‌లో పుట్టిన తనకు ప్రతి నీటిబొట్టు విలువ తెలుసన్నారు.

దేశంలో జీవనదులున్నప్పటికీ వాటిలో నీళ్లు లేవని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌ సర్కార్‌ని నదుల నీటిని పరిరక్షించడంలో మెరుగ్గా పనిచేస్తుందని.. ఇతర రాష్ట్రాలు మధ్యప్రదేశ్‌ను అనుసరించాలని మోడీ కితాబిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీబీఐ ఉచ్చులో చిదంబరం... ఆయనపై ఏపీ,తెలంగాణలకు కసి...