Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీబీఐ ఉచ్చులో చిదంబరం... ఆయనపై ఏపీ,తెలంగాణలకు కసి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చిన వ్యవహారంలో అప్పటి కేంద్ర మంత్రి పి.చిదంబరం పాత్ర గురించి వేరే చెప్పక్కర్లేదు. ఆ సమయంలో చిదంబరంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెద్దఎత్తున నిరసన కూడా తెలిపారు. లంచం తీసుకున్నారన్న ఆరోపణల నేపధ్యంలో చిదంబరంపై సీబీఐ

సీబీఐ ఉచ్చులో చిదంబరం... ఆయనపై ఏపీ,తెలంగాణలకు కసి...
, మంగళవారం, 16 మే 2017 (13:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చిన వ్యవహారంలో అప్పటి కేంద్ర మంత్రి పి.చిదంబరం పాత్ర గురించి వేరే చెప్పక్కర్లేదు. ఆ సమయంలో చిదంబరంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెద్దఎత్తున నిరసన కూడా తెలిపారు. లంచం తీసుకున్నారన్న ఆరోపణల నేపధ్యంలో చిదంబరంపై సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. ఈ వార్తపై యూపీ, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడుల్లో సెర్చ్ చేశారు. కానీ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మాత్రం ఆయన గురించి కనీసం పట్టించుకున్నట్లే లేదు. దీనికి కారణం... రాష్ట్ర విభజన సమయంలో ఆయన మంత్రిగా తీసుకున్న నిర్ణయమేనన్న వార్తలు వినబడుతున్నాయి.
 
కాగా చిదంబరం నివాసంలో సీబీఐ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఆయనతో పాటు.. ఆయన కుమారుడు కార్తీ చిదంబరం ఇంట్లోనూ సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. అలాగే తమిళనాడు వ్యాప్తంగా 14 ప్రాంతాలతో పాటు ఢిల్లీ, నోయిడాలోనూ సీఐబీ ఏకకాలంలో మంగళవారం ఈ దాడులు నిర్వహించింది. 
 
విదేశీ పెట్టుబడులు తీసుకునేందుకు ఓ మీడియా గ్రూపునకు లంచం తీసుకుని అనుమతులు ఇప్పించినట్లు కార్తీ చిదంబరం సంస్థ ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా... కుమార్తె హత్య కేసులో జైలుజీవితం గడుపుతున్న స్టార్ ఇండియా మాజీ సీఈఓ భార్య ఇంద్రాణి ముఖర్జీయాకు చెందిన ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు 2008లో దొడ్డిదారిలో అనుమతులు మంజూరుచేయించినట్టు కార్తీపై ఆరోపణలున్నాయి. 
 
అలాగే, ఎయిర్‌సెల్, మ్యాక్సిస్ ఒప్పందాల వ్యవహారం కేసులో కార్తీ చిదంబరంపై ఆదాయపన్ను శాఖ, ఈడీ వర్గాలు దాడులు నిర్వహించింది. ఇదేవిధంగా రాజస్థాన్‌లో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 108 అంబులెన్స్ సేవల్లో చోటుచేసుకున్న అవినీతిలో కార్తీ చిదంబరానికి వాటా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో చిదంబరం, కార్తీ చిదంబరం నివాసాల్లో సోదాలు చేయడం గమనార్హం. 
 
ఈ సోదాలపై చిదంబరం స్పందిస్తూ... కేంద్ర ప్రభుత్వం నీచ రాజకీయాలకు పాల్పడుతోందని, కేవలం రాజకీయ కక్షతోనే తనపై సీబీఐతో దాడులు చేయించిందని ఆరోపించారు. 'నా కుమారుడు, అతని మిత్రులను లక్ష్యంగా చేసుకుని సీబీఐ, ఇతర ఏజెన్సీలతో కేంద్రం దాడులు చేయిస్తోంది. నా గొంతు నొక్కేందుకు, ఎలాంటి రాతలు రాయకుండా నిరోధించేందుకే ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతోంది. విపక్ష నేతలు, పాత్రికేయులు, కాలమిస్టులు, ఎన్జీఓలు, పౌర సంస్థల గొంతునొక్కుతున్న రీతిలోనే నా పట్లా వ్యవహరిస్తోంది. ఒక్కటి మాత్రం చెప్పదలచుకున్నాను. ఏం చేసినా నన్ను మాట్లాడనీయకుండా, రాయనీయకుండా చేయలేరు' అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''వాన్నా క్రై'' దాడులకు ఉత్తర కొరియా హస్తముందా? టూల్‌ను కనుగొన్నారట..