Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెరిగిన స్త్రీ శిశువుల జనన రేటు

పెరిగిన స్త్రీ శిశువుల జనన రేటు
, సోమవారం, 25 జనవరి 2021 (09:57 IST)
దేశంలో ప్రస్తుతం లింగ నిష్పత్తి కాస్త మెరుగుపడిందని పేర్కొంటూ కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ తాజా గణాంకాలను వెల్లడించింది. దీని ప్రకారం.. 2014 - 15 ఏడాదితో పోలిస్తే.. 2019 - 20లో పురుడుపోసుకుంటున్న పిల్లల లింగ నిష్పత్తిలో (సెక్స్‌ రేషియో ఎట్‌ బర్త్‌ాఎస్‌ఆర్‌బీ) స్త్రీ శిశువుల సంఖ్య కొద్దిగా పెరిగింది.

దాదాపు 16 శాతం లింగ నిష్పత్తిలో మెరుగుదల నమోదైంది. 2014 - 2015లో ప్రతి వేయి మంది అబ్బాయిలకు 918 మంది అమ్మాయిలు పుట్టగా.. 2019 - 20లో వేయి మంది అబ్బాయిలకు అమ్మాయిల సంఖ్య 934కు పెరిగింది.


కాగా, 2015 జనవరిలో కేంద్రం తీసుకువచ్చిన 'బేటీ బచావో.. బేటీ పడావో' కార్యక్రమం మంచి ఫలితాలను రాబట్టిందనీ, ఈ క్రమంలోనే ఆడపిల్లల సంఖ్య పెరుగుతోందని పేర్కొంది. దేశంలోని 640 జిల్లాల్లో 422 జిల్లాలు జనన సమయ లింగ నిష్పత్తిలో మెరుగైన ఫలితాలు సాధించాయని తెలిపింది.

2014 - 2015లో చాలా తక్కువ లింగ నిష్పత్తి కలిగిన యూపీలోని పలు జిల్లాల్లో మంచి మెరుగుదల కనిపించింది. యూపీలోని మౌలో వేయి మంది అబ్బాయిలకు 694 మంది ఆడపిల్లలు ఉండగా.. ప్రస్తుతం అది 951కి పెరిగింది.

అలాగే, హర్యానాలోని కర్నాల్‌, మహేందర్‌ గఢ్‌, రేవారిలలోనూ ఆడపిల్లల సంఖ్య పెరిగింది. పంజాబ్‌లోని పాటియాలలో 847 నుంచి 933కు పెరిగింది.

కాగా, బేటీ బచావో.. బేటీ పడావో పథకం కింద తీసుకున్న చర్యలు లింగ వివక్షవ్యాప్తి, దానిని నిర్మూలించడంతో కీలకంగా ఉందనీ, ప్రజల్లో అవగాహనను కూడా పెంచిందని మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

7న ఐఐఐటి రెండో విడత కౌన్సెలింగ్‌