Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సన్యాల్ నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు.. ఇష్టం లేకపోయినా ఇద్దరు నన్ను..?: రష్యా యువతి

ఢిల్లీ సెక్స్ రాకెట్‌లో చిక్కుకొని బయటపడిన 23 ఏళ్ల రష్యా యువతి మనస్తాపంతో చేతి మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో చికిత్స జరిపించాక రష్యన్ రాయబార కార్యాలయం అధికారుల సహకారంతో పోలీసులు రష్య

Advertiesment
సన్యాల్ నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు.. ఇష్టం లేకపోయినా ఇద్దరు నన్ను..?: రష్యా యువతి
, మంగళవారం, 26 జులై 2016 (10:21 IST)
ఢిల్లీ సెక్స్ రాకెట్‌లో చిక్కుకొని బయటపడిన 23 ఏళ్ల రష్యా యువతి మనస్తాపంతో చేతి మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో చికిత్స జరిపించాక రష్యన్ రాయబార కార్యాలయం అధికారుల సహకారంతో పోలీసులు రష్యన్ యువతి వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

ధనవంతులు, ప్రముఖులు, ఆయుధ డీలర్లకు తనను సన్యాల్ (వ్యభిచార బ్రోకర్) పరిచయం చేశాడని.. తనకు ఇష్టం లేకపోయినా ఇద్దరు వ్యక్తులు తనకు లైంగికంగా వాడుకున్నారని, తాను ఇలా సెక్స్ రాకెట్‌లో ఇరుక్కుంటానని తెలియదని రష్యన్ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. 
 
బంగారు పంజరంలో చిక్కుకున్న పక్షిలా విలవిల్లాడానని, తనకు ఇష్టం లేకపోయినా లైంగికంగా తనను వాడుకున్న వారెవరో తనకు తెలియదని రష్యా యువతి చెప్పుకొచ్చింది. ఢిల్లీలోని సఫ్ధర్జంగ్ ఎన్క్లేవ్ హౌస్‌లో ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడి చేసినపుడు అక్కడ సెక్స్ రాకెట్‌లో చిక్కుకున్న రష్యా యువతిని రక్షించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 25వతేదీన ఆగస్టు వరకు చెల్లుబాటయ్యే వీసాతో అజయ్ అహ్లావత్ స్పాన్సర్ సహాయంతో ఇండియాకు వచ్చి బిజ్ వాసన్ ప్రాంతంలోని ఫాం హౌస్‌లో ఉన్నానని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. 
 
తన వ్యవహారాలను రాడియా అనే మహిళ చూసేదని, ఆమె తనను సన్యాల్ వ్యవసాయక్షేత్రానికి తీసుకువెళ్లి ఆయన్ను పరిచయం చేసిందని రష్యాయువతి పేర్కొంది. సన్యాల్ తనను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడని, దీంతో తాము భార్యభర్తల్లానే ఉండేవారమని, ఆయన తనను దక్షిణ ఢిల్లీలో జరిగిన పార్టీలకు తీసుకువెళ్లే వాడని తెలిపింది. సన్యాల్ వయసు తనకంటే మూడు రెట్లు ఎక్కువని, ఆయనకు ఇదివరకే పెళ్లి కూడా అయిందని తెలిపింది. 
 
తన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు తీర్చేందుకు సన్యాల్‌ను పెళ్లాడదామని అనుకున్నానని, కాని ఇలా సెక్స్ రాకెట్‌లో చిక్కుకుంటానని ఊహించలేదని చెప్పింది. పోలీసులు సన్యాల్ ఫోన్‌లోని వాట్సాప్ మెసేజ్‌లు, ఎస్ఎంఎస్, ఛాటింగ్‌ల డేటాను సేకరించారు. తాను తన దేశానికి తిరిగి వెళ్లాలనుకుంటున్నట్లు రష్యా యువతి వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నైలో అదృశ్యమైన విమానం... తూర్పుగోదావరి అటవీ ప్రాంతంలో చక్కర్లు కొట్టిందా?