అట్టహాసంగా ముగిసిన గాలి కుమార్తె పెళ్లి.. మైనింగ్ కంపెనీపై ఐటీ శాఖ దాడులు.. ఏమైనా దొరికిందా?
మైనింగ్ కింగ్‌గా పేరున్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తన కుమార్తె వివాహాన్ని అట్టహాసంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. భారీ ఆభరణాలు, భారీ సెట్టింగ్‌లు, భారీ భోజన వెరైటీలు.. ఇలా ప్రతి చిన్న వ
మైనింగ్ కింగ్‌గా పేరున్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తన కుమార్తె వివాహాన్ని అట్టహాసంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. భారీ ఆభరణాలు, భారీ సెట్టింగ్‌లు, భారీ భోజన వెరైటీలు.. ఇలా ప్రతి చిన్న విషయాన్ని భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టిన గాలి జనార్ధన్ రెడ్డి కష్టాలు తప్పలేదు. తాజాగా గాలి జనార్ధన్ రెడ్డిపై ఐటీ దాడులు మొదలయ్యాయి. కర్ణాటక బళ్ళారి లోని ఓబులాపురం మైనింగ్ కంపెనీపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిపింది.
కానీ ఈ దాడుల్లో లభించిన పత్రాలపై ఇంకా వివరాలు తెలియరాలేదు. నోట్ల రద్దు తర్వాత కూడా కుమార్తె వివాహం ఘనంగా జరిపారనే వార్తల నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ సహా పలువురు నేతలు గాలి జనార్ధన్ రెడ్డిపై ఆరోపణలు గుప్పించారు.
ఈ నేపథ్యంలో గాలి ఆఫీసులో ఐటీ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. మాజీ బిజేపీ నేత అయిన గాలి జనార్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో కొంత కాలం జైలులో గడిపి ఇటీవలే బయటకు వచ్చారు. కుమార్తె వివాహ ఆడంబరానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల్లో హల్‌చల్ చేస్తున్న తరుణంలో ఐటీ శాఖ ఈ దాడులు జరపడం గమనార్హం.