Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డొనాల్డ్ ట్రంప్‌‍కు క్లూనీ హెచ్చరిక-హితబోధ.. ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేయాలి లేదంటే..?

అమెరికా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న డొనాల్డ్ ట్రంప్‌కు అంతర్జాతీయ హక్కుల ప్రముఖ న్యాయవాది అమల్ క్లూనీ సీరియస్‌ వార్నింగ్ ఇచ్చారు. అమెరికాకు కొన్ని కట్టుబాట్లున్నాయని.. వాటిని ఆయన గౌరవించాల్సిందేన

Advertiesment
డొనాల్డ్ ట్రంప్‌‍కు క్లూనీ హెచ్చరిక-హితబోధ.. ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేయాలి లేదంటే..?
, సోమవారం, 21 నవంబరు 2016 (17:36 IST)
అమెరికా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న డొనాల్డ్ ట్రంప్‌కు అంతర్జాతీయ హక్కుల ప్రముఖ న్యాయవాది అమల్ క్లూనీ సీరియస్‌ వార్నింగ్ ఇచ్చారు. అమెరికాకు కొన్ని కట్టుబాట్లున్నాయని.. వాటిని ఆయన గౌరవించాల్సిందేనని లేకుంటా హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఆమె హెచ్చరించారు.

అమెరికాయేతరుల పట్ల విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడంపై క్లూనీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అమెరికా నుంచి కొన్ని హక్కుల ఉల్లంఘనల ఘటనలకు సంబంధించి తనకు ఫోన్లు వస్తున్నాయని నైతిక నిబంధనలు అమెరికా తప్పకుండా పాటించాలని గుర్తు చేశారు. మతపరమైన విద్వేషాలకు తావివ్వకుండా చూడాలని కోరారు.
 
ప్రచారం కోసం చేసిన వ్యాఖ్యలను ఆచరణలో పెడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్‌కు ఆమె హితవు పలికారు. అమల్ క్లూనీ హక్కుల న్యాయవాదిగానే కాకుండా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చెర నుంచి బయటపడిన బాధితులకు కూడా ఆమె అండగా ఉంటున్నారు. అంతేకాదు, వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు ప్రతినిధిగా ఉన్నారు. 
 
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా ఆమె స్పందిస్తారు. ఈ నేపథ్యంలో టెక్సాస్‌లో జరిగిన సదస్సులో ట్రంప్‌కు సూచనలు చేశారు. ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను పక్కనబెట్టి.. నిబద్ధతతో పాలన చేయాలని.. టెర్రరిస్టులతో అనుమానమున్న కుటుంబాలను అంతమొందించాలనే వ్యాఖ్యలు కూడా మానవ హక్కుల ఉల్లంఘన నేరం కిందకు వస్తుందని క్లూనీ చెప్పారు.

ఇప్పటికే ప్రపంచాల్లోని కొన్ని దేశాల్లో అమెరికాలో ఉన్న తమ వాళ్లకు సంబంధించి కొంత ఆందోళన నెలకొందని, దానిని పోగొట్టాల్సిన బాధ్యత ట్రంప్‌కే ఉందని గుర్తు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

న‌.మో.కి సంపూర్ణ ఆయుష్షు క‌ల‌గాల‌ని బంద‌రులో హోమం